గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2025, శనివారం

ధనమస్తీతి వాణిజ్యం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

తే.గీ.  ధనమస్తీతి వాణిజ్యం  -  కించిదస్తీతి కర్షణం |

సేవా న కించిదస్తీతి  -  భిక్షా నైవ చ నైవ చ ||

తే.గీ.  ధనము కలిగిన వాణిజ్యమున బ్రతుకుము,

భూమి కలిగిన వ్యవసాయమున బ్రతుకుము,

సకలమును లేని నాడు సేవకునుగాను

బ్రతుక నేర్చుము, యాచనన్ బ్రతుకవలదు.     

భావము.  ధనం ఉంటే వ్యాపారం, కొంచెం భూమి అయినా ఉంటే వ్యవసాయం, 

ఏమీ లేకపోతే సేవా వృత్తి. కానీ భిక్షాటన మాత్రం ఎప్పటికీ తగదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.