జైశ్రీరామ్.
ప్రశ్నలు.
సీ. “ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
గీ. అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”
సమాధానాలు.
1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం! ( శ్రీరంగం )
3.లకోల కోల! ( కోల= బాణం)
4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం! ( దామం అంటే దండ)
6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)
8.నంద సదనం! ( నందుని ఇల్లు)
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.