జైశ్రీరామ్.
మైలవరపు మురళీకృష్ణ
జన్మస్థలం.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మం. పొడగట్లపల్లి
తల్లిదండ్రులు..
కీ. శే. శ్రీ అచ్యుతరామయ్య శ్రీమతి లక్ష్మీకాంతం
జననం..
శ్రీ శుభకృత్ నామ సం. పుష్య బ. చతుర్దశ గురువారం అనగా
24-1-1963
విద్యావిషయం..
సాహిత్యవిద్యాప్రవీణ
(M. A . Sanskrit)
శిక్షాశాస్త్రి( B. Ed.)
వృత్తి..
విశ్రాంత సంస్కృతోపన్యాసకులు
ప్రవృత్తి...
పద్యరచన.. అష్టావధాన నిర్వహణ
అష్టావధానాలు... 26
బిరుదుల...
మధురకవి...
అవధానిశేఖర
ఇష్టదైవం..
శ్రీ వేంకటేశ్వర స్వామి..
శ్రీ సాయిబాబా
రచనలు..
శ్రీ వెంకటేశ్వర శతకము..
సద్గురు సాయిదేవరాశతకము..
వసుంధరాశతకము..
శ్రీ నారసింహమ్
గోపికామాధవం (అముద్రితం)
శ్రీ వినాయక చరితము... (అముద్రితం)
గంగావతరణము (అముద్రితం)
స్వాతంత్ర్యోద్యమ మణిదీపాలు (అముద్రితం)
సమస్యాపూరణలు (5000) (అముద్రితం).
సభాధ్యక్షుఁడుగా నేను దీపారాధనానంతరం
శ్రీమన్మంగళ భారతాంబ కృపతో చెల్వొందు మిమ్మందరిన్
బ్రేమన్ చిత్తమునందునిల్పి ప్రణతుల్ వే చేసెవన్ భక్తితోన్,
ధీమంతుల్సభలోనిపెద్దలెన్నగ, మహా తేజంబుతో నీ సభన్
క్షేమంబొప్పగ నిర్వహించుదురు, రాశీభూత పుణ్యాత్ములై.
అని ప్రాంభించాను.
ఈ శతకమును ప్రశంసిస్తూ కంది శంకరయ్య
తే.గీ. శంకరాభరణపు సమస్యలకు నద్భు
తమ్ముులౌ పూరణముల నందంగఁ జేయు
నీదు ప్రతిభ జగద్ వ్యాప్తమై దినదిన
మెల్ల సహృదయులకుఁ బ్రీతి నెలమి గూర్చు!!
అని చెప్పారు.
మ్తైల్రవ్తిరపు వారిని గూర్చి.
వారు
మహతి ఆడిటోరియంలో ఉగాది వేడుకల్లో..
నీ రమణీయవక్త్రమును నిత్యముగాంచుట మాకు పర్వమౌ!
ధీరసమీరసంకలితదివ్యవనాంతర సీమనున్న నీ
వారము మమ్ము గాంచుమని పల్కుచు కృష్ణునిముగ్ధమోహనా..
కారము కన్నులం బడగ గౌతుకమందిరి గోపభామినుల్.
అని వ్రాసినారు.
ఈ నాటి సభలో
ముఖ్య అతిథి.. సురభి శంకరశర్మ
విశిష్ట అతిథి శ్రీ ముద్దు రజయ్య.
ఆత్మీయ అతిథి....శ్రీ కంది శంకరయ్య.
గ్రంథ ఆవిష్కరణ... బ్రహ్మశ్రీ నరహరి గారు.
గ్రంథ సమీక్ష వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచె వేంకట అనంతకృష్ణ.
నారుమంచివారికి నా పద్యకుసుమ సమర్పణ.
ప్రవరులు వేగ్విదాంవరులు ప్రస్ఫుటరీతిని నారసింహమున్
శ్రవణ సుపేశలమ్ముగను చక్కగ భాగవతార్థరీతిలో
ప్రవరులు మెచ్చ బల్కిరిట భద్రత గొల్పు నృసింహదైవమే
జవమును సత్వమున్ గొలిపి చక్కగ వీరిని కాచుగావుతన్.
ఈ ఆవిష్కరింపబడిన గ్రంథమును గూర్చి...
గ్రంథ ముద్రణ...శ్రీ ఒజ్జల శరత్ బాబు.
శ్రీనారసింహం...వ్యాఖ్యానం...శ్రీకరణం శేషగిరిరావుగారు.
గానం చేసినవారు.
కోరుకొండ ప్రసాదరాయ శాస్త్రి
సౌమ్య
మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ
ఈ కావ్యం సత్సంతాన ఫలప్రదం అని ఫలశ్రుతి.
సభా చిత్రాలు.
బోధనాగురువు డా.జీ.వీ.జె.యె.సోమయాజిగారిని సన్మానించినప్పుడు...
స్వస్తి వచనంతో సభ మంగళాంతమయింది.
జైహింద్.
Print this post
2 comments:
శ్రీ క్రోధి నామ సం. రథసప్తమి మంగళవారం ది. 4-2-2025 సాయంతనం శిల్పాస్ ఆర్వీ ధర్మిష్ఠ మియాపూర్ నందు ఆహ్లాదకరవాతావరణంలో ప్రహ్లాదకథ శ్రీ నారసింహమ్ గ్రంథం పెద్దల సమక్షంలో ఆవిష్కృతమైనది. ఈ కార్యక్రమంలో మా ప్రత్యక్షగురువులు శ్రీ డి. వి. జి. సోమయాజులుగారు సభలోనుండుట మరింత శోభాకరమైనది.
శ్రీ నారసింహ పద్యాలకు అద్భుతమైన వ్యాఖ్య వ్రాసిన శ్రీ కరణం శేషగిరిరావు గారు పాల్గొను మరొక ఆనందకరసన్నివేశము.
శ్రీ చింతా రామకృష్ణారావు గారు తమ ఆధ్యక్షము ను సమర్థవంతముగా నిర్వహించారు. శ్రీ సురభి శంకరశర్మ, శ్రీ ముద్దు రాజయ్య, శ్రీ కంది శంకరయ్య వంటి దిగ్దంతులైన అవధానుల మధ్య ఈ పుస్తకం ఆవిష్కృతమైనది. శ్రీ నరహరి గారి ప్రోత్సాహసహకారములు ఈ సభకు మణిదీపాలు.
ఇక వాగ్విదాంవరులైన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణశర్మగారు రసవత్తరముగా గ్రంథసమీక్షనొనరించి గ్రంథం లోని కవిహృదయమును సమగ్రముగా ఆవిష్కరించారు.
గ్రంథకర్తనైన నాకు అపరిమితానందము కలిగినది. ఎంతో ఔదార్యముతో శ్రీ నారసింహ గతమైన సద్భక్తితో శ్రీ వొజ్జల శరత్బాబు గారు ఈ గ్రంథరాజమును ముద్రింపజేసినారు. దీనిని వారు స్వామికైంకర్యముగా భావించుచున్నట్లు తెలిపినారు.
గ్రంథకర్త శ్రీ మైలవరపు మురళీకృష్ణ తమ మామగారైన కీ. శే. బ్రహ్మశ్రీ వేలూరి వేంకట రామసుబ్బారావు గారికి (ప్రతినిధి గా శ్రీ వేలూరి వేంకట సుబ్రహ్మణ్యం గారికి) ఈ గ్రంథమును అంకితమిచ్చినారు. ఈ సందర్భముగా ..
అంకముజేర్చి పెంచి తనయన్ సతిగా బొనరించి నాకు ని..
శ్శంకితసౌఖ్యమిచ్చిరి విశాలమతిన్ వర సుబ్బరాయ! యే
వంక ఋణమ్ము దీర్తు నిదె వ్రాసిన పొత్తము భక్తితోడ మీ
కంకితమిచ్చుచుంటి గొనుమంచు వినమ్రతనంజలించెదన్!!
అనెడి పద్యము తో వారిని సంస్మరించుకొన్నారు..
మరియు..
చింతాన్వయేందులౌ శ్రీ రామకృష్ణుల
ఆధ్యక్షమున సభ యలరుచుండ
సుప్రసిద్ధవధాని సురభి శంకరశర్మ
సుందర వాగ్ధాటి శోభలీన
ముద్దు రాజయ్య సమ్మోహనమ్మగు పద్య
సందేశసుధలతో విందుజేయ
కందిశంకరార్య కమనీయరమణీయ
వాక్చమత్కృతితోడ వరలుచుండ
మంచిమాటల మా నారుమంచివారు
మెచ్చి తీయనిదైన సమీక్ష జేయ
దనరె శ్రీ నారసింహసద్గ్రంథమిచట
నాకు ముదమయ్యె జన్మ ధన్యమ్మునయ్యె!!
అని వినయముగా సభను ప్రశంసించారు. ఈ పద్యాలను శ్రీ కోరుకొండ ప్రసాదరాయశాస్త్రి, శ్రీమతి పెన్న సౌమ్య, శ్రీమతి మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ సభలో గానం చేసి అలరించారు.
చివరగా పసందైన విందుభోజనముతో సభ దిగ్విజయమైనది.
అందరికీ శ్రీ నారసింహానుగ్రహప్రాప్తిరస్తు.
మైలవరపు మురళీకృష్ణ
గ్రంథకర్త.
చాలా సంతోషమండి. మీ కలం మరిన్ని చక్కని ప్రబోధాత్మక గ్రంథాలను కూడా ర్ద్భవింపఁజేయాలని కోరుకొంటూ మీకు అభినందనలు తెలియఁజేస్తున్నాను. జైశ్రీరామ్. జై భారత్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.