జైశ్రీరామ్.
శ్లో. పరాధీనం వృథా జన్మ - పరస్త్రీషు వృథా సుఖం।
పరగేహే వృథా లక్ష్మీః - విద్యా యా పుస్తకే వృథా॥
తే.గీ. పరులకాధీనమగు జన్మ వ్యర్థమిలను,
పరులకాంతల పొందును వ్యర్థమరయ,
పరుల యింటిలో గల సిరి వ్యర్థమెన్న,
భవ్యగ్రంథస్థ జ్ఞానమ్ము వ్యర్థము గన.
భావము. పరాధీనమైనట్టి బ్రతుకు, పరస్త్రీల వలన సుఖము, పరుల యింట
నున్న ధనము, పుస్తకముల యందలి జ్ఞానము సమయమునకు అక్కరకు
వచ్చునవి గావు.అందుచేత, మన దగ్గర ఎన్ని పుస్తకాలను పోగు
చేసుకున్నామన్నది కాదు, ఎన్నింటిని పూర్తిగా చదివి ఆకళింపు
చేసుకున్నామన్నదే గమనించాల్సిన విషయము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.