జైశ్రీరామ్.
1.కం:-శ్రీవరు నామామృతమున
భావన బంగార మవగ!భాసుర లీలన్!
"మా-వరదాంబుధు లలరగ!
కావంగా హరి హరులను గానము సేతున్!
2,కం:-ఏకాగ్రత కావలె నయ
శ్రీకారము చుట్టు భక్తి సిద్ధాత్ముడవై!
ప్రాకారాంతర్గత శివు
సాకారము నొందె దీవు!సత్కృత తపతన్!
3.కం:-హితకరి మతకరి శుభకరి
గతికరి పతనాతప హరి!కామద హారీ!
స్తుతిమతి పశుపతి నుతమతి
నతులిత స్తుతిమంత గావు!హర హర శంభో!
4.కం:-అతి గతి జగతికి నీవే!
నుతమతి కరుణార్ద్ర దేవ!నావవు నీవై!
బ్రతుకుల సాగర తరణను
నతి వేగము చేయ రావె!నంబయు మెచ్చన్!
5,కం:-కర్తవు ధర్తవు భర్తవు
హర్తవు సర్వార్ధ మీవు!నార్యోత్తముడా!
నర్తన జగములు బ్రోచెడి
కర్తవ్యముగా దలంచి!కావగ రావే!
6.కం:-శివ నీ నామము నందే
నవ తారక శాంత ముండె!నాట్య కలాపా!
భవ బంధమోచ నంబున
కవితా సౌరభ్య మబ్బ కావగ రావే!
7,కం:-దయనీయ జీవితాలను
దయ తోడుత గావు నీవు!ధర్మాత్ముడవే!
భయమేల?మాకు నిలలో!
నియతను నుతియింతు మదిని!నిర్మల మూర్తీ!
8,కం;-హరి హర భేదము లేదని
నిరువురు నొకటే యటంచు!నిహము నుతింపన్!
పరి పరి విధముల భేదము
సరిగా దది పాప యుతము!సరిగను మదినిన్!
9,కం:-హాలాహల విజృంభణ
కోలాహలమును గని మరి కుత్తుక నిడితే!
ఫాలాక్ష సురల కోరిక
పాలించిన పరమ శివా!పద్ధతి నీదే!
10,కం:-వెన్నుడు సిరి గొని సుఖ పడె
మిన్నంటెడి కీర్తి గనగ మ్రింగితి విషమున్!
చెన్నగు లోకపు టుపకరి!
మన్ననగా కంఠమం దమరగ నిడితే!
11.కం:-నుదుటను వేడిమి నిడుకొని
ముదమున గరళంపు మంట ముచ్చట నౌనా?
గుది బండని యెంచని హర
పదిలంబుగ శిగను గంగ పరమం బేర్చెన్!
12.కం:-నిరుపమ విక్రమ క్రమత, మ
విరళ జన రక్ష దక్ష విభవము గూర్చెన్!
కరములు మోడిచి మ్రొక్కెద
కరుణించుమి పరమ శివా!కలుముల నెలమిన్!
13,కం:-భృకుటిని దృష్ఠిని నిలుపుచు
సకలము శివ మయ మటంచు!సన్నుతి సేయన్!
వికల మనస్కుల మార్చెదు
టక టక కట కటలు బాపి!ఢమరుక పాణీ!
14.కం:-ఢమరుక పాణీ!శశి ధర!
కమరా!నటరాజ భోజ!కారుణ్య మయీ!
మమతా సమతల దేవా!
సుమ దామా!కర్పూర కళిక!సోయగ దేహా!
15.కం:-మమకార జగతి మాయలు
కమనీయము కాదటంచు!కలి"వివరింపన్!
తమకము గమకము శివ మని
మము బ్రోవగ నిల్చి తీవు!మహిమాన్వితుడా!
16,కం:-సు రుచిర ఫలములు తినుటలు
పర మరుదగు శివ జపమును!వరదములు సుమా!
మరువకు శివ వశదములను
నరులకు నిలుపోపు నట్టి!న్యాయం బదియే!
17,కం:-లలితము కలితము చేయకు!
మలిదుల దరి జేర నీకు!మాలిన్య మగున్!
సు లలితుల సుందర మూర్తుల
చెలిమిని శివ నామ స్మరణ!చేయుమి భక్తిన్!
18,కం:-పర పేడన తగ దేరికి
పర హింసే పాప మనుచు పద్ధతి నడుమా!
నరులం నారాయణు గను!
నరకంబుకు దూర మౌదు!నమ్ముమి శివునిన్!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.