జైశ్రీరామ్.
ముద మొదవు భాషణంబున్!మొద లెరిగిన సత్యమ్!మోదము పరమార్ధంబదే!
సుదతు లెడ మాతృ భావమ్!సొద లెడమగు నిష్ఠన్!శోధిత వర దీక్షే సుమా!
పదిలపు టుదార వాచ్యమ్!పదపడి నడు కీర్తిన్!వాదంబుల కెడమేగుటౌ!
నిధి గదె సురార్థ చర్యల్!నిధను డనెద వేలన్?నీ దనుకొను దైవంబు నున్!
సృజనాత్మక గర్భ కవీతా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతంలు.10,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"ముదమొదవు"వృత్తము,
ముద మొదవు భాషణంబున్!
సుదతు లెడ మాతృ భావమ్!
పదిలపు టుదార వాచ్యమ్!
నిథి గదె సురార్ధ చర్యల్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లొనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత"మొద లెరుగు"వృత్తము,
మొద లెరిగిన సత్యమున్!
సొద లెడమగు నిష్ఠన్!
పదపడి నడు కీర్తిన్!
నిధను డనెద వేలన్?
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము"లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు8"అక్షరము లుండును,
3.గర్భగత"మోదమున"వృత్తము,
మోదము పరమార్ధంబదే!
శోధిత వర దీక్షే సుమా!
వాదంబుల కెడం బేగుటౌ!
నీదనుకొను దైవంబునున్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లొనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు,9,అక్షరము లుండును,
4.గర్భగత"నిధి గదె"వృత్తము,
ముద మొదవు భాషణంబున్!మొద లెరిగిన సత్యమున్!
సుదతు లెడ మాతృ భావమ్!సొద లెడమగు నిష్ఠన్!
పదిలపు టుదార వాచ్యమ్!పదపడి నడు కీర్తిన్!
నిధి గదె సురార్ధ చర్యల్!నిధను డనెద వేలన్?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"నిధన"వృత్తము,
మొద లెరిగిన సత్యమ్!ముద మొదవు భాషణంబున్!
సొద లెడమగు నిష్టన్!సుదతు లెడ మాతృ భావమ్!
పద పడి నడు కీర్తిన్!పదిలపు టుదార వాచ్యమ్!
నిధను డనెద వేలన్?నిధి గదె సురార్ధ చర్యల్!
అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
6,గర్భగత"వాదిలు"వృత్తము,
ముద మొదవు భాషణంబున్!మోదము పరమార్ధం బదే!
సదతు లెడ మాతృ భావమ్!శోధిత వర దీక్షే సుమా!
పదిలపు టుదార వాచ్యమ్!వాదముల కెడం బే గుటౌ!
నిధి గదె సురార్ధ చర్యల్!నీ దనుకొను దైవంబునున్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము గలదు,పాదమునకు,"18"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"దీక్షారతి"వృత్తము,
మోదము పరమార్థం బదే!ముదమొదవు భాషణంబున్!
శోధిత వర దీక్షే సుమా!సుదతు లెడ మాతృ భావమ్!
వాదముల కెడం బేగుటౌ!పదిలపు టుదార వాచ్యమ్!
నీదనుకొను దైవంబునున్!నిధు గదె సుదార్ధ చర్యల్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"నిజ కీర్తి"వృత్తము,
మొద లెరిగిన సత్యమ్!మోదము పరమార్ధం బదే!
సొద లెడమగు నిష్ఠన్!శోధిత వఠ దీక్షే సుమా!
పద పడి నడు కీర్తిన్!వాదముల కెడం బేగుటౌ!
ని ధనుడ వనెద వేలన్?నీ దనుకొను దైవంబునున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి9,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"వరదంబు"వృత్తము,
మోదము పరమార్ధం బదే!మొద లెరిగిన సత్యమ్!
శోధిత వర దీక్షే సుమా!సొద లెడమగు నిష్ఠన్!
వాదముల కెడం బేగుటౌ!పద పడి నడు కీర్తిన్!
నీ దనుకొను దైవంబు నున్ !నిధను డనెద వేలన్?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యకషరమునకు చెల్లును,
10,గర్భగత"-సొద లెడము"వృత్తము,
మొద లెరిగిన సత్యమ్!ముద మొదవు భాషణంబున్!మోదము పరమార్ధం బదే!
సొద లెడమగు నిష్ఠన్!సుదతు లెడ మాతృ భావమ్?శోధిత వర దీక్షే సుమా!
పద పడి నడు కీర్తిన్!పదిలపు టుదార వాచ్యమ్!వాదముల కెడం బేగు టౌ!
నిధను డనెద వేలన్?నిధి గదె సురార్ధ చర్యల్!నీ దనుకొను దైవంబునున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్పరములకు చెల్లును,
11.గర్భగత"వర దీక్షా"వృత్తము,
మోదము పరమార్ధం బదే!ముద మొదవు భాషణంబున్!మొద లెరిగిన సత్యమ్!
శోధిత వర దీక్షే సుమా!సుదతు లెడ మాతృ భావమ్!సొద లెడమగు నిష్ఠన్!
వాదముల కెడం బేగు టౌ!పదిలపు టుదార వాచ్యమ్!పద పడి నడు కీర్తిన్!
నీదను కొను దైవంబు నున్!నిధి గదె సురార్ధ చర్యల్!నిధను డనెద వేలన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"-పదిలము"వృత్తము,
మొద లెరిగిన సత్యమ్!మోదము పరమార్ధం బదే!ముద మొదవు భాషణంబున్!
సొద లెడమగు నిష్ఠన్!శోధిత వర దీక్షే సుమా!సుదతు లెడ మాతృ భావమ్!
పద పడి నడు కీర్తిన్!వాదముల కెడం బేగు టౌ!పదిలపు టుదార వాచ్యమ్!
నిధను డనెద వేలన్?నీ దనుకొను దైవంబునున్!నిధి గదె సురార్ధ చర్యల్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు."918,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"పద పడు"వృత్తము,
మోదము పర మార్ధంబదే!మొద లెరిగిన సత్యమ్!ముద మొదవు భాషణంబున్!
శోధిత వర దీక్ష సుమా!సొద లెడమగు నిష్ఠన్!సుదతు లెడ మాతృ భావమ్!
వాదముల కెడం బేగు టౌ!పద పడి నడు కీర్తిన్!పదిలపు టుదార వాచ్యమ్!
నీదనుకొను దైవంబునున్!నిధనుడ వనెద వేలన్?నిధి గదె సురార్ధ చర్యల్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"పరమార్ధ"వృత్తము,
ముద మొదవు భాషణం బున్!మోదము పరమార్ధం బదే!మొద లెరిగిన సత్యమ్!
సుదతు లెడ మాతృ భావమ్!శోధిత వర దీక్ష సుమా!సొద లెడమగు నిష్ఠన్!
పదిలపు టుదార వాచ్యమ్!వాదముల కెడం బేగు టౌ!పద పడి నడు కీర్తిన్!
నిధి గదె సురార్ధ చర్యల్!నీదనుకొను దైవంబునున్!నిధను డనెద వేలన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.