జైశ్రీరామ్.
చరాచర జీవ జాలమ్!జనన మరణాల పర్వమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!
పరంపర నాప నౌనే?వనధి కెరటాల తుల్యమ్!బాగు సత్వము నెంచు ధర్మమ్!
నిరంతర క్షోభ తుల్యమ్!నినదమగు శోక తత్వమ్!నీ గురిత్వమె నిత్య సత్యమ్!
పరంతపు నార్తి మోక్షమ్!పనుప సుర సాకరంబౌ!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,9,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"-చరాచర"-వృత్తము,
చరాచర జీవ జాలమ్!
పరంపర నాప నౌనే?
నిరంతర క్షోభ తుల్యమ్!
పరంతపు నార్తి మోక్షమ్!
అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్ఛందము"లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
2.గర్భగత"పరంపర"వృత్తము,
జనన మరణాల పర్వమ్!
వనధి కెరటాల తుల్యమ్!
నినదమగు శోక తత్వమ్!
పనుప సుర సాకరంబౌ!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
3.గర్భగత"-నిరంతర"వృత్తము.
సాగు మీశ్వరు ముక్తి ధామమ్!
బాగు.సత్యము నెంచు ధర్మమ్!
నీ గురుత్వమె నిత్య సత్యమ్!
వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"-కెరటాల"వృత్తము,
చరాచర జీవ జాలమ్!జనన మరణాల పర్వమ్!
పరంపర నాప నౌనే?వనధి కెరటాల తుల్యమ్!
నిరంతర క్షోభ తుల్యమ్!నినదమగు శోక తత్వమ్!
పరంతపు నార్తి మోక్షమ్!పనుప సుర సాకరంబౌ!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"పర్వం"వృత్తము,
జనన మరణాల పర్వమ్!చరాచర జీవ జాలమ్!
వనధి కెరటాల తుల్యమ్!పరంపర నాప నౌనే?
నినదమగు శోక తత్వమ్!నిరంతర క్షోభ తుల్యమ్!
పనుప సుర సాకరంబౌ!పరంతపు నార్తి మోక్షమ్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"శోకతా"-వృత్తము,
చరా చర జీవ జాలమ్!
చరాచర జీవ జాలమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!
పరంపర నాప నౌనే?బాగు సత్వము నెంచు ధర్మమ్!
నిరంతర క్షోభ తుల్యమ్!నీ గురుత్వమె నిత్య సత్యమ్!
పరంతపు నార్తి మోక్షమ్!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!
అణిమా ఛందము నందలి""అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.9 వ యక్షరమునకు చెల్లును,
7,గర్భగత"తత్వం"వృత్తము,
సాగు మీశ్వరు ముక్తి ధామమ్!చరా చర జీవ జాలమ్!
బాగు సత్వము నెంచు ధర్మమ్!పరంపర నాప నౌనే?
నీ గురుత్వమె,నిత్య సత్యమ్!నిరంతర క్షోభ తుల్యమ్!
వాగ ధీ శ్వరు మెచ్చు నిచ్ఛన్!పరంతపు నార్తి మోక్షమ్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరములుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"-సాకర"-వృత్తము,
జనన మరణాల పర్వమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!
వనధి కెరటాల తుల్యమ్!బాగు,సత్వము నెంచు ధర్మమ్!
నినదమగు శోక తత్వమ్!నీ గురుత్వమె నిత్య సత్యమ్!
పనుప సుర సాకరంబౌ!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"గురుత్వ"వృత్తము,
సాగు మీశ్వరు ముక్తి ధామమ్!జనన మరణాల పర్వమ్!
బాగు సత్వము నెంచు ధర్మమ్!వనధి కెరటాల తుల్యమ్!
నీ గురుత్వమె నిత్య సత్యమ్!నినదమగు శోక తత్వమ్!
వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!పనుప సుర సాకరంబౌ!
అణిమా ఛందము నందలి"ధృతి,ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10"వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"నినద"వృత్తము,
జనన మరణాల పర్వమ్!చరాచర జీవ జాలమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!
వనధి కెరటాల తుల్యమ్!పరంపర నాప నౌనే?బాగు,సత్వము నెంచు ధర్మమ్!
నినదమగు శోక తత్వమ్!నిరంతర క్షోభ తుల్యమ్!నీ గురుత్వమె నిత్య సత్యమ్!
పనుప సుర సాకరంబౌ!పరంతపు నార్తి మోక్షమ్!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-వనధి"-వృత్తము,
చరాచర జీవ జాలమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!జనన మరణాల పర్వమ్!
పరంపర నాప నౌనే?బాగు,సత్వము నెంచు ధర్మమ్!వనధి కెరటాల తుల్యమ్!
నిరంతర క్షోభ తుల్యమ్!నీ గురుత్వమె నిత్య సత్యమ్!నినదమగు శోక తత్వమ్!
పరంతపు నార్తి మోక్షమ్!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!పనుప సుర సాకరంబౌ!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"పనుప"వృత్తము,
సాగు మీశ్వరు ముక్తి ధామమ్!చరాచర జీవ జాలమ్!జనన మరణాల పర్వమ్!
బాగు.సత్వము నెంచు ధర్మమ్!పరంపర నాప నౌనే?వనధి కేరటాల తుల్యమ్!
నీ గురుత్వమె నిత్య సత్యమ్!నిరంతర క్షోభ తుల్యమ్?నినదమగు శోక తత్వమ్!
వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!పరంతపు నార్తి మోక్షమ్!పనుప సుర సాకరంబౌ!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18అక్షరములకు చెల్లును,
13.గర్భగత"జీవజాల"-వృత్తము,
జనన మరణాల పర్వమ్!సాగు మీశ్వరు ముక్తి ధామమ్!చరాచర జీవ జాలమ్!
వనధి కెరటాల తుల్యమ్!బాగు.సత్వము నెంచు ధర్మమ్!పరంపర నాప నౌనే?
నినదమగు శోక తత్వమ్!నీ గురుత్వమె నిత్య సత్యమ్!నిరంతర క్షోభ తుల్యమ్!
పనుప సుర సాకరంబౌ!వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!పరంతపు నార్తి మోక్షమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"తపనార్తి"వృత్తము,
సాగు మీశ్వరు ముక్తి ధామమ్!జనన మరణాల పర్వమ్!చరాచర జీవ జాలమ్!
బాగు,సత్వము నెంచు ధర్మమ్!వనధి కెరటాల తుల్యమ్!పరంపర నాప నొనే?
నీ గురుత్వమె నిత్య సత్యమ్!నినదమగు శోక తత్వమ్!నిరంతర క్షోభ తుల్యమ్!
వాగధీశ్వరు మెచ్చు నిచ్ఛన్!పనుప సుర సాకరంబౌ!పరంతపు నార్తి మోక్షమ్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.