జైశ్రీరామ్.
కాఫీ ప్రియుల కోసం ప్రత్యేకం.1670 సంవత్సరంలో బాబా బుడాన్ అనే సాధువు మన దేశానికి మక్కా నుంచి రహస్యంగా పట్టుకొచ్చి మన కర్ణాటకలోని చిక్ మగళూరు లో నాటిన కాఫీ విత్తనాలతో మన దేశంలో ప్రారంభమైన కాఫీ ప్రస్థానం .. ఈ రోజు మనం ఒక్క రోజు కూడా కాఫీ తాగకుండా ఉండలేని స్థితికి మనల్ని తీసుకొచ్చింది . ఆ కర్ణాటక కాఫీ కాస్తా కేరళ కాఫీ , తమిళనాడు కాఫీ , మైసూర్ కాఫీ , కొయంబత్తూరు కాఫీ , ఫిల్టర్ కాఫీ , ఇన్స్టంట్ కాఫీ , espresso , cappuccino , థర్డ్ వేవ్ కాఫీ .. ఇలా ఎన్నో అవతరాలు దాల్చి మనల్ని కాఫీ దాసుల్ని చేసేసింది .
ఇక కాఫీ దండకం విషయానికొస్తే తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో 2012 లో వచ్చిన మిధునం సినెమా కోసం జొన్నవిత్తుల గారు వ్రాసిన కాఫీ దండకం రుచి మనం ఎప్పటికీ మర్చిపోలేం .గుర్తొచ్చినప్పుడల్లా అధ్భుతహ అనుకుంటాం . ఇలాంటి కాఫీ దండకం 100 సంవత్సరాల క్రితం గుంటూరు దగ్గరి మాచర్ల కు చెందిన ఒక కవి గారు అద్భుతంగా .. ఆశువుగా చెప్పారు . 1920 ప్రాంతాల్లో జరిగిన సంఘటన అది .అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రాభవశాలి గా పేరుపొందిన పోకూరి కాశీపత్యావధాని అనే అవధాన పండితుడు అవధానం చేయడం కోసం చెన్న పట్టణం అదె ఇప్పటి చెన్నై వెళ్లారట . సభా ప్రారంభానికి ముందు నిర్వాహకులు ఆయనకు కాఫీ ఇచ్చారట .. ఆ కాఫీని ఆయన పూర్తిగా తాగక ముందే సభ ప్రారంభం కావడంతో ఆయన పూర్తిగా కాఫీ తాగకుండానే వేదిక ఎక్కారట . అదే అవధానంలో పృచ్చకులుగా ఉన్న ఆంధ్ర విశారద బిరుదాంకితులు తాపీ ధర్మారావు గారు .. అవధానంలో భాగంగా... కాఫీ మీద దండకం చెప్పమని కోరారట . అప్పుడు కవి సింహ బిరుదాంకితులైన ఆ పోకూరి కాశీపతి అవధాని గారు ఆశువుగా చెప్పిన కాఫీ దండకం ఎంత మధురంగా ఉంటుందో .. కాఫీ రుచి లాగే .. ఆస్వాదించండి
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.