జైశ్రీరామ్.
శ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం
ఏక శ్లోకాన్ని భాగవత ద్వాదశస్కంధాలలోని ఇతివృత్తాలుగ
వ్యాఖ్యానించిన గ్రంథం.
వ్యాసులవారి సంస్కృత ~ భాగవతపురాణం,ప్రథమస్కం, ప్రథమాధ్యాయం-౧
శ్లో. జన్మాద్యయస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞఃస్వరాట్
తేనేబ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా
ధామ్నాస్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి.
ఈ శ్లోకాన్ని బమ్మెర పోతన ఇలా తెనిగించినాడు.
సీ.విశ్వ జన్మస్థితి-విలయంబు లెవ్వని
వలన నేర్పడు నను-వర్తనమున
వ్యావర్తనమున గా-ర్యములం దభిజ్ఞుడై
తాన రాజగుచు జి-త్తమున జేసి
వేదంబు లజునకు-విదితముల్ గావించె
నెవ్వడు బుధులు మో-హింతు రెవ్వ
నికి నెండమావులు-నీట గాచాదులు
నన్యోన్యబుద్ధి దా-నడరునట్లు
ఆ.త్రిగుణ సృష్టి యెందు-దీపించి సత్యము
భంగి దోచు స్వప్ర-భానిరస్త
కుహకు డెవ్వ డతని-గోరి చింతించెద
ననఘు సత్యు బరుని-నను దినంబు
-భాగవత కథాప్రారంభం(అవతారికతర్వాత)1స్కం,34
వ్యాసుని సంస్కృతభాగవతంలోని పై మొదటి శ్లోకానికి
వంశీధరశర్మ అనే విద్వన్మణి ప్రథమస్కంధంనుండి ద్వాదశస్కంధంవరకు
ఉండే వివిధ ఇతివృత్తాలుగల 134 అర్థాలు వచ్చేవిధంగా వ్యాఖ్యానం
రచించినాడు. అంటే
ఈ శ్లోకాన్ని 134 విధాలుగ వ్యాఖ్యానించినాడు.ఆ రచనకు శ్రీమద్భాగవత
లీలాకల్పద్రుమం అని పేరు. ఈ రచను తెలుగు అనువాదంతో 2011 లో
డా.తలముడిపి బాల సుబ్బయ్య ప్రచురించినారు.
పైశ్లోకానికి ప్రథమస్కంధం నుండి ద్వాదశస్కంధం వరకూ
ఉండే వివిధ ఇతివృత్తాలుగా అర్థం చెప్పడం విశేషం. సంస్కృత భాగవతంలోని
ఒకే శ్లోకానికి 134అర్థాలుగలశ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం అరుదైన
విశేష గ్రంథం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.