గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఫిబ్రవరి 2025, శనివారం

నాఽస్తి కామ సమో వ్యాధిః | ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  నాఽస్తి కామసమో వ్యాధిః |  -  నాఽస్తి మోహసమో రిపుః |

నాఽస్తి కోపసమో వహ్నిః |  -  నాఽస్తి జ్ఞానాత్‌ పరం సుఖమ్‌ ||

తే.గీ.  కామమును మించు వ్యాధియే కనఁగ లేదు,

మోహమునుమించఁ గల్గు రిపువన లేదు,

కోపమును మించ లేదగ్ని కువలయమున,

జ్ఞానమునుమించు సుఖమిం గనఁగ లేదు. 

భావము.  కామముతో సమానమైన వ్యాధి మఱొకటిలేదు. మోహముతో సమానుడైన 

శత్రువు మఱొకడు లేడు. కోపముతో సమానమైనది మఱొక యగ్ని లేదు. 

ఆత్మజ్ఞానమునకు మించిన సుఖమింకొకటి లేదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.