జైశ్రీరామ్.
మంచి పెంచు మెల్లెడలన్!మరువకు సరివారినిన్!మారకు లోభత్వ చింతనన్!
మించ కేగు సాధు మతిన్!మెరుగు బ్రతుకు కోరుమా!మీరకు ధర్మార్ధ కామముల్!
కుంచితాలు వీడు మిలన్!కురచత విడనాడుమా!కోరుము పర్మాత్ము చేరికన్!
మించు కీర్తి నెంచు సదా!మెరుగు జిలుగు లేలకో?మేరను మీరంగ దోషమౌ!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి.అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"-మంచి పెంచు"వృత్తము,
మంచి పెంచు మెల్లెడలన్!
మించ కేగు సాధు మతిన్!
కుంచితాలు వీడు మిలన్!
మించు కీర్తి నెంచు సదా!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు8,అక్షరము లుండును,
2.గర్భగత"మించ కేగు"వృత్తము,
మరువకు సరి వారినిన్!
మెరుగు బ్రతుకు కోరుమా!
కురచత విడ నాడుమా!
మెరుగు జిలుగు లేలకో?
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,ఙ
ప్రాస నియమము కలదు,పాదమునకు.9'అక్షరము లుండును,
3.గర్భగత"కుంచిత"-వృత్తము,
మారకు లోభత్వ చింతనన్!
మీరకు ధర్మార్ధ కామముల్!
కోరుము పర్మాత్ము చేరికన్!
మేరను మీరంగ దోషమౌ!
అభిజ్ఞా ఛందము నందలి""బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్ధగత"కీర్తిదము"వృత్తము,
మంచి పెంచు మెల్లెడలన్!మరువకు సరి వారినిన్!
మించ కేగు సాధు మతిన్!మెరుగు బ్రతుకు కోరుమా!
కుంచితాలు వీడు మిలన్!కురచత విడ నాడు మా!
మించు కీర్తి నెంచు సదా!మెరుగు జిలుగు లేలకో?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమమ కలదు,పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"సత్కృప"వృత్తము,
మరువకు సరి వారినిన్!మంచి పెంచు మెల్లెడలన్!
మెరుగు బ్రతుకు కోరుమా!మించ కేగు సాధు మతి నిన్!
కురచత విడ నాడుమా!కుంచితాలు వీడు మిలన్!
మెరుగు జిలుగు లేలకో?మించు కీర్తి నెంచుమా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"కురచన"వృత్తము,
మంచి పెంచు మెల్లెడలన్!మీరకు లోభత్వ చింతనన్!
మించ కేగు సాధు మతిన్!మీరకు ధర్మార్ధ కామముల్!
కుంచితాలు వీడు మిలన్!కోరుము పర్మాత్ము చేరికన్!
మించు కీర్తి నెంచు సదా!మేరను మీరంగ దోషమౌ!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.9"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"మెరుగులు"వృత్తము,
మారకు లోభత్వ చింతనన్!మంచి పెంచు మెల్లెడలన్!
మీరకు ధర్మార్ధ కామముల్!మించ కేగు సాధు మతిన్!
కోరుము పర్మాత్ము చేరికన్!కుంచితాలు వీడు మిలన్!
మేరను మీరంగ దోషమౌ!మించు కీర్తి నెంచు సదా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛ్దము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"సుఖ జీవనా"వృత్తము,
మరువకు సరి వారినిన్!మారకు లోభత్వ చింతనన్!
మెరుగు బ్రతుకు కోరుమా!మీరకు ధర్మార్ధ కామముల్!
కురుచత విడ నాడుమా!కోరుము పర్మాత్ము చేరికన్!
మెరుగు జిలుగు లేలకో?మేరను మీరంగ దోషమౌ!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"పర్మాత్మ"వృత్తము
మారకు లోభత్వ చింతనన్!మరువకు సరి వారినిన్!
మీరకు ధర్మార్ధ కామముల్!మెరుగు బ్రతుకు కోరుమా!
కోరుము పర్మాత్ము చేరికన్!కురచత విడ నాడుమా!
మేరను మీరంగ దోషమౌ!మెరుగు జిలుగు లేలకో?
అణిమా ఛందము నందలి"ధృతి"ఛుదము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"అరిషడులు"వృత్తము,
మరువకు సరి వారినిన్!మంచి పెంచు మెల్లెడలన్!మారకు లోభత్వ చింతనన్!
మెరుగు బ్రతుకు కోరుమా!మించ కేగు సాధు మతిన్!మీరకు ధర్మార్ధ కామముల్!
కురచత విడ నాడుమా!కుంచితాలు వీడు మిలన్!కోరుము పర్మాత్ము చేరికన్!
మెరుగు జిలుగు లేలకో?మించు కీర్తి నెంచు సదా!మేరను మీరంగ దోషమౌ!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
11,గర్భగత"మితి మీరు"వృత్తము,
మంచి పెంచు మెల్లెడలన్!మారకు లోభత్వ చింతనన్!మరువకు సరి వారినిన్!
మించ కేగు సాధు మతిన్!మీరకు ధర్మార్ధ కామముల్!మెరుగు బ్రతుకు కోరుమా!
కుంచితాలు వీడు మిలన్!కోరుము పర్మాత్ము చేరికన్!కురచత విడ నాడుమా!
మించు కీర్తి నెంచు సదా!మేరను మీరంగ దోషమౌ!మెరుగు జిలుగు లేలకో?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము.లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
12,గర్భగత:-చెడు తలపు"వృత్తము,
మారకు లోభత్వ చింతనన్!మంచి పెంచు మెల్లెడలన్!మరువకు సరి వారినిన్!
మీరకు ధర్మార్ధ కామముల్!మించ కేగు సాధు మతిన్!మెరుగు బ్రతుకు కోరుమా!
కోరుము పర్మాత్ము చేరికన్!కుంచితాలు వీడు మిలన్!కురచత విడ నాడుమా!
మేరను మీరంగ దోషమౌ!మించు కీర్తి నెంచు సదా!మెరుగు జిలుగు లేలకో?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు కు చెల్లును,
13.గర్భగత"మీరకు"వృత్తము,
మరువకు సరి వారినిన్!మారకు లోభత్వ చింతనన్!మంచి పెంచు మెల్లెడలన్!
మెరుగు బ్రతుకు కోరుమా!మీరకు ధర్మార్ధ కామముల్!మించకేగు సాధు మతిన్!
కురచత విడ నాడుమా!కోరుము పర్వాత్ము చేరికన్!కుంచితాలు వీడు మిలన్!
మెరుగు జిలుగు లేలకో?మేరను మీరంగ దోషమౌ!మించు కీర్తి నెంచు సదా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"లోభత్వ"వృత్తము,
మారకు లోభత్వ చింతనన్!మరువకు సరివారినిన్!మంచి పెంచు మెల్లెడలన్!
మీరకు ధర్మార్ధ కామముల్!మెరుగు బ్రతుకు కోరుమా!మించ కేగు సాధు మతిన్!
కోరుము పర్మాత్ము చేరికన్!కురచత విడ నాడుమా!కుంచితాలు వీడు మిలన్!
మేరను మీరంగ దోషమౌ!మెరుగు జిలుగు లేలకో?మించు కీర్తి నెంచు సదా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కబదు,పాదమునకు"26"అక్షరము లుండును
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.