గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఫిబ్రవరి 2025, సోమవారం

క్షరము.అక్షరము,తధ్యము.శ్లోకితము.అద్దిర.సత్యము.బీజపూర్ణ..కీర్తిద,సౌఖ్య.ప్రపూర్ణతా.విశ్వ మూల,పరమం,బీజ శక్తి.భాసుర.గర్భ"విరాజమాన"-వృత్తము, రచన...శ్రీవల్లభ.

 జైశ్రీరామ్.

క్షరము గాని యక్షరమ్!సద్యశో విరాజ మానమై!సత్తు తత్తు నంటి నిల్చులే!
పరము విశ్వ మూలకమ్!వద్యమై ప్రపూర్ణ బీజమై.పత్తివాసు కీర్తిదంబునై!
కరము నిల్చు శాశ్వతమ్!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కత్తి కోత లాపి గాచులే!@
తరము లెన్ని మారినన్!తధ్య మిద్ది తెల్యగా వలెన్!తత్తు భావ భాసురం బిదే!

సత్తు=సత్యము.తత్తు=పరమము,వద్యమై=చెప్పబడునదియై,పత్తివాసు=
పుట్టపర్తి నివాసుడు(దైవాంశ సంభూతుడగు "సత్యసాయి.కత్తి కోత=
జీవహింస.

సృజనాత్మక గర్భ కవితా ఛందము నందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
అక్రరములు,9,18,యతులు చెల్లును,

1.గర్భగత"క్షరము" వృత్తము,

క్షరము గాని యక్షరమ్!
పరము విశ్వ మూలకమ్!
కరము నిల్చు శాశ్వతమ్!
తరము లెన్ని మారినన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరములుండును,

2.గర్భగత"అక్షరము వృత్తము,

సద్యశోవిరాజమానమై!
వద్యమై ప్రపూర్ణ బీజమై!
గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!
తథ్య మిద్ది తెల్యగా వలెన్!

అణిమా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదము నకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"-తథ్యము" వృత్తము,

సత్తు తత్తు నంటి నిల్చులే!
పత్తి వాసు కీర్తిదంబునై!
కత్తి కోత లాపి గాచులే!
తత్తు భావభాసురంబిదే!

అణిమా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,

4,గర్భగత"శ్లోకితము"-వృత్తము,

క్షరము గాని యక్షరమ్!సద్యశో విరాజ మానమై!
పరము విశ్వ మూలకమ్!వద్యమై ప్రపూర్ణ బీజమై!
కరము నిల్చు శాశ్వతమ్!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!
తరము లెన్ని మారినన్!తథ్య మిద్ది తెల్యగా వలెన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"అద్దిర"వృత్తము,

సద్యశో విరాజ మానమై!క్షరము గాని యక్షరమ్!
వద్యమై ప్రపూర్ణ బీజమై!పరము విశ్వ మూలకమ్!
గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కరము నిల్చు శాశ్వతమ్!
తథ్య మిద్ది తెల్యగా వలెన్!తరము లెన్ని మారినన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"సత్యము"వృత్తము,

క్షరము గాని యక్షరమ్!సత్తు తత్తు నంటి నిల్చులే!
పరము విశ్వ మూలకమ్!పత్తి వాసు కీర్తిదంబునై!
కరము నిల్చు శాశ్వతమ్!కత్తి కోత లాపి గాచులే!
తరము లెన్ని మారినన్!తత్తు భావ భాసురంబిదే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"బీజ పూర్ణ"వృత్తము,

సత్తు తత్తు నంటి నిల్చులే! క్షరము గాని యక్షరమ్!
పత్తివాసు కీర్తిదంబునై!పరము విశ్వ మూలకమ్!
కత్తి కోత లాపి గాచులే!కరము నిల్చు శాశ్వతమ్!
తత్తు భావ భాసురం బిదే!తరము లెన్ని మారినన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"కీర్తిద"వృత్తము,

సద్యశో విరాజ మానమై!సత్తు తత్తు నంటి నిల్చు లే!
వద్యమౌ ప్రపూర్ణ బీజమై!పత్తి వాసు కీర్తిదంబునై!
గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కత్తి కోత లాపి గాచులే!
తథ్య మిద్ది తెల్యగా వలెన్!తత్తు భావ భాసురం బిదే!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"సౌఖ్య"వృత్తము,

సత్తు తత్తు నంటి నిల్చు లే!సద్యశో విరాజ మానమై!
పత్తి వాసు కీర్తిదంబు నై!వద్యమౌ ప్రపూర్ణ బీజమై!
కత్తి కోత లాపి గాచులే!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!
తత్తు భావ భాసురం బిదే!తథ్య మిద్ది తెల్యగా వలెన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది, 
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"1]"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"ప్రపూర్ణ"వృత్తము,

సద్యశో విరాజ మానమౌ!క్షరము గాని యక్షరమ్!సత్తు తత్తు నంటి నిల్చులే!
వద్యమౌ ప్రపూర్ణ బీజమై!పరము విశ్వ మూలకమ్!పత్తి వాసు కీర్తిదంబునై!
గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కరము నిల్చు శాశ్వతమ్!కత్తి కోత లాపి గాచులే!
తథ్యమిదే తెల్యగా వలెన్!తరము లెన్ని మారినన్!తత్తు భావ భాసురం బిదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరములుండును,
యతులు.10,18"అక్షరములకు చెల్లును,

11.గర్భగత" విశ్వ మూలం"వృత్తము,

క్షరము గాని యక్షరమ్!సత్తు తత్తు నంటి నిల్చులే!సద్యశో విరాజ మానమౌ!
పరము విశ్వ మూలకమ్!పత్తి వాసు కీర్తిదంబునౌ!వద్యమౌ ప్రపూర్ణ బీజమై!
కరము నిల్చు శాశ్వతమ్!కత్తి కోత లాపి గాచులే!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!
తరము లెన్ని మారినన్!తత్తు భావ భాసురంబిదే!తథ్యమిదే తెల్యగా వలెన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు.9,18;అక్షరములకు చెల్లును,

12.గర్భగత"పరమం"-వృత్తము,

సత్తు తత్తు నంటి నిల్చులే!క్షరము గాని యక్షరమ్!సద్యశో విరాజ మానమౌ!
పత్తి వాసు కీర్తిదంబునౌ!పరము విశ్వ మూలకమ్!వద్యమౌ ప్రపూర్ణ బీజమై!
కత్తి కోత లాపి గాచులే!కరము నిల్చు శాశ్వతమ్!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!
తత్తుభావ భాసురంబిదే!తరము లెన్ని మారినన్!తథ్య మిదే తెల్యగా వలెన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"బీజ శక్తి"వృత్తము,

సద్యశో విరాజమానమై!సత్తు తత్తు నంటి నిల్చులే!క్షరముగాని యక్షరమ్!
వద్యమౌ ప్రపూర్ణ బీజమై!పత్తి వాసు కీర్తిదంబునౌ!పరము విశ్వ మూలకమ్!
గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కత్తి కోత లాపి గాచులే!కరము నిల్చు శాశ్వతమ్!
తథ్యమిదే తెల్యగా వలెన్!తత్తు భావ భాసురం బిదే!తరము లెన్ని మారినన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"భాసుర"వృత్తము,

సత్తు తత్తు నంటి నిల్ఛులే!సద్యశో విరాజ మానమై!క్షరము గాని యక్షరమ్!
పత్తి వాసు కీర్తిదంబునౌ!వద్యమౌ ప్రపూర్ణ బీజమై!పరము విశ్వ మూలకమ్!
కత్తి కోతలాపి గాచులే!గధ్య పద్య శ్లోక సంస్తుతిన్!కరము నిల్చు శాశ్వతమ్!
తత్తు భావ భాసురంబిదే!తథ్య మిదేతెల్యగా వలెన్!తరము లెన్ని మారినన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.