గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఫిబ్రవరి 2025, మంగళవారం

బృహత్ శ్రీధరీయము గ్రంథావిష్కరణ సందర్భముగా డా. మహాదేవమణి దంపతులకు చేయుచున్న సత్కారం.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
ఉపాసన సమ్మాన్ 2025 స్వీకరించు సందర్భంలో శ్రీధరీయం గ్రంథావిష్కరణ సందర్భముగా
బ్రహ్మశ్రీ మహాదేవమణి బావగారికి 
అభినందనపూర్వక నమస్సులు.🌹🍑🍒🙏🏻

మందాక్రాంత వృత్త గర్భ మేఘవిస్ఫూర్జిత వృత్తము.
👇🏻
క్షితి శ్రీమంతంబౌ శ్రిత గణ లసచ్ఛ్రీద శ్రీ ధూళిపాళన్

ధృతిన్ ధీమంతుండౌ స్థిర సుగుణ మూర్తిన్ మహాదేవ సౌమ్యూన్

శ్రితున్ బ్రేమోద్దీప్తిన్  వితతముగ ధాత్రిన్ గనన్ సాంబమూర్తిన్

స్మిత శ్రీ మార్గంబున్ జెలఁగి కొలుతున్ శ్రీధరీయ ప్రదీప్తిన్.
🙏🏻👇🏻
మేఘవిస్ఫూర్జిత వృత్తగర్భస్థ మందాక్రాంత వృత్తము.
👇🏻
శ్రీమంతంబౌ శ్రితగణలసచ్ఛ్రీద శ్రీ ధూళిపాళన్

ధీమంతుండౌ స్థిర సుగుణ మూర్తిన్ మహాదేవ సౌమ్యున్

బ్రేమోద్దీప్తిన్  వితతముగ ధాత్రిన్ గనన్ సాంబమూర్తిన్

శ్రీ మార్గంబున్ జెలఁగి కొలుతున్ శ్రీధరీయ ప్రదీప్తిన్.
🙏🏻
అమ్మ దయతో🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.









Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.