గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

వరదాంగ,ఉజ్వల,కాంతిదా,ఆనందవర,ఝరీ,ఆనందకరీ.సాంభవా,సర్వేశ్వర,జీవాత్మ,పరమాత్మ,స్థిరణశప్రాసాద,సంస్తుత్య,సత్కృపా, గర్భ"కృపానంద"-వృత్తము.....రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

వర దాంగోజ్వల కాంతిదా!పరమేశా!ఈశా! శివా!ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!
నిరతానంద కరీ!ఝరీ!నిరవద్య!సర్వాత్మకా!నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!
వర దీనోద్ధర మానసా!పరమాత్మ!సర్వేశ్వరా!ప్రాసాద వాసంబు లిడంగన్!
సిరిదా!వాక్కరి శాంభవా!స్థిర మీర!జీవాత్మకా!శ్రీ సత్కృపానంద వరంబౌ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,ఆనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"వరదాంగ"వృత్తము,

వర దాంగోజ్వల కాంతిదా!
నిరతానంద కరీ!ఝరీ!
వర దీరోద్ధార మానసా!
సిరిదా!వాక్కరి శాంభవా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-ఉజ్వల"వృత్థము,

పరమేశా!ఈశా!శివా!
నిరవద్య సర్వాత్మకా!
పరమాత్మ!సర్వేశ్వరా!
స్థిర మీర!జీవాత్మకా!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"కాంతిదా"వృత్తము,

ప్రా సస్త్య ధీరా! సుర శ్రేష్ఠా!
నీ  సౌమ్య సంస్తుత్య  శృతంబే!
ప్రసాద వాసంబు లిడంగన్!
శ్రీ సత్కృపా నంద వరంబౌ!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాష నియమము కలదు,పాదమునకు"9,అక్షరము లుండును,

4.గర్భగత"ఆనంద వర"వృత్తము,

వర దాంగోజ్వల కాంతిదా!పరమేశా!ఈశా!శివా!
నిరతానంద కరీ ఝరీ!నిర వద్య సర్వాత్మకా!
వర ధీరోద్ధార మానసా!పరమాత్మ సర్వేశ్వరా!
సిరిదా వాక్కరీ శాంభవా!స్థిర మీర జీవార్మకా!

అణిమా ఛందము నందలి"అత్యష్టీ"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"ఝరీ"వృత్తము,

పరమేశా!ఈశా!శివా!వర దాంగోజ్వల కాతిదా!
నిరవద్య సర్రవాత్తామకా!నిరతా నంద కరీ!ఝరీ!
సరమాత్మ సర్వేశ్వరా!వర ధీరోద్ధార మానసా!
స్థిర మీర జీవాత్మకా!సిరిదా!వాక్కరి శాంభవా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.9;వ యక్షరమునకు చెల్లును,

6,గర్భగత"ఆనంద కరీ"వృత్తము,

వర దాంగోజ్వల కాంతిదా!ప్రాసస్థ్య ధీరాసుర శ్రేష్ఠా!
నిరతానంద కరీ ఝరీ!నీసౌమ్య సంస్తుత్య సృతంబే!
వర ధీరోద్ధార మానసా!ప్రాసాద వాసంబు లిడంగన్!
సిరిదా వాక్కరి శాంభవా!శ్రీ సత్కృపానంద వరంబౌ!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు.18.అక్షరము లుండును,
యతి,10,వ యకషరమునకు చెల్లును,

7.గర్భగత"శాంభవా"-వృత్తము,

ప్రాసస్థ్య ధీరా!సుర శ్రేష్ఠా!వర దాంగోజ్వల కాంతిదా!
నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!నిరతానంద కరీ ఝరీ!
ప్రాసాద వాసంబు లిడంగన్!వర ధీరోద్ధార మానసా!
శ్రీ సత్కృపానంద వరంబౌ!సిరిదా వాక్కరి శాంభవా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"18"అక్షరము లుండును,
యతి.10,వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"సర్వేశ్వర"వృత్తము,

పరమేశా!ఈశా!శివా!ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!
విర వద్య సర్వాత్మకా!నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!
 పరమేశ!సర్వాత్మకా!ప్రాసాద  వాసంబు లిడంగన్!
స్థిర మీర జీవాత్మకా!శ్రి సత్కృపానంద వరంబౌ!

అణిమా ఛందము నందలి,అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"జీవాత్మ"వృత్తము,

ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!సరమేశా!ఈశా!శివా!
నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!నిర వద్య సర్వాత్మకా!
ప్రాసాద వాసంబు లిడంగన్!పరమేశా!సర్వాత్మకా!
శ్రీ సత్కృపానంద వరంబౌ!స్థిర మీర!జీవాత్మకా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"పరమాత్మ"వృత్తము,

 పరమేశా!ఈశా!శివా!వర దాంగోజ్వల కాంతిదా!ప్రా సస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!
నిరవద్య సర్వాత్మకా!నిరతానంద కరీ!ఝరీ!నీసౌమ్య సంస్తృత్య సృతంబే!
పరమాత్మ!సర్వేశ్వరా!వర ధీనోద్ధర మానసా!ప్రాసాద వాసంబు లిడంగన్!
స్థిర మీర!జీవాత్మకా!సిరిదా!వాక్కరి శాంభవా!శ్రే సత్కృపా నంద వరంబౌ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"స్థిరదా"వృత్తము,

పరమేశ!ఈశా!శివా!ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!వర దాంగోజ్వల కాంతిదా!
నిరవద్య సర్వాత్మకా!నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!నిరతానంద కరీ!ఝరీ!
పరమాత్మ సర్వేశ్వరా!ప్రాసాద వాసంబు లిడంగన్!వర ధీనోద్ధర మానసా!
స్థిర మీర జీవాత్మకా!శ్రీ సత్కృపా నంద వరంబౌ!సిరిదా వాక్కరి శాంభవా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"ప్రాసాద"వృత్తము,

ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!వర దాంగోజ్వల కాంతిదా!పరమేశ!ఈశా!శివా!
నీసౌమ్య సంస్తృత్య సృతంబే!నిరతానంద కరీ!ఝరీ!నిర వద్య సర్వాత్మకా!
ప్రాసాద వాసంబు లిడంగన్!వర ధీనోద్ధర మానసా!పరమాత్మ సర్వేశ్వరా!
శ్రీ సత్కృపానంద వరంబౌ!సిరిదా వాక్కరి శాంభవా!స్థిర మీర జీవాత్మకా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"సంస్తుత్య"వృత్తము,

పరమేశ!ఈశా!శివా!ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!వర దాంగోజ్వల కాంతిదా!
నిరవద్య సర్వాత్మకా!నీ సౌమ్య సంస్తుత్య సృతంబే!నిరతానంద కరీ!ఝరీ!
పరమాత్మ సర్వేశ్వరా!ప్రాసాద వాసంబు లిడంగన్!వర ధీనోద్ధర మానసా!
స్థిర మీర జీవాత్మకా!శ్రీ సత్కృపానంద వరంబౌ!సిరిదా వాక్కరి శాంభవా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛంథము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"సత్కృపా"వృత్తము,

ప్రాసస్త్య ధీరా!సుర శ్రేష్ఠా!పరమేశ!ఈశా!శివా!వర దాంగోజ్వల కాంతిదా!
నీసౌమ్య సంస్తుత్య సృతంబే!నిర వద్య సర్వాత్మకా!నిరతానంద కరీ!ఝరీ!
ప్రాసాద వాసంబు లిడంగన్!పరమాత్మ సర్వేశ్వరా!వర ధీనోద్ధర మానసా!
శ్రీ సత్కృపా నంద వరంబౌ!స్థిర మీర జీవాత్మకా!సిరిదా!వాక్కరి శాంభవా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.