గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2025, గురువారం

నారుంతుదః స్యాదార్తోఽపి. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  నారుంతుదః స్యాదార్తోఽపి  -  న పరద్రోహకర్మధీః |

యయాస్యోద్విజతే వాచా   -  నాలోక్యాం తాముదీరయేత్ ||   (మనుస్మృతి)

తే.గీ.  బాధలందున మనమున్నఁ బరులఁ బాధ

పెట్ట రాదు, ద్రోహముఁ దలపెట్టరాదు,  

పరులకసహనమగునవి పలుకరాదు,

పలుకరాదనుచితములు, బ్రహ్మవిదుఁడ!       

భావము.  మనమే బాధలలో ఉండినా, ఇతరులకు బాధ కలిగించే మాటలు 

పలుకకూడదు. ఇతరులకు ద్రోహమయ్యే పని చేయకూడదు, అలాగే అలాంటి 

ఆలోచనలు కూడా ఉండకూడదు. ఇతరులకు అసహనాన్ని కలిగించే, 

సామాజిక మర్యాదలకు విరుద్ధమైన లేదా అనుచితమైన మాటలు 

మాట్లాడకూడదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.