గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2025, గురువారం

ఇదం తీర్ధమిదం తీర్ధం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  ఇదం తీర్ధమిదం తీర్ధం  -  భ్రమన్తి తామసా జనాః

ఆత్మతీర్ధం నజానన్తి  -  కధం మోక్షః శృణు ప్రియే.

తే.గీ.  ఇదిగొ తీర్థంబు, పుణ్యంబు నిదియె యిచ్చు,

నదిగొ తీర్థంబు ముక్తినే యది యొసంగు

నంచు మునుగుదు రిచ్చట నెంచనేర

రాత్మతీర్థాన మునుగక నబ్బవనుచు.

భావము.  ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో 

స్నానమాచరించిన మోక్షం కలుగును! అని తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు 

మానవులు ఆత్మ తీర్థమున మానసికముగా మునుగనినాడు అవి లభించవని 

తెలియలేకున్నారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.