జైశ్రీరామ్.
శ్లో. దుష్టా భార్యా శఠో మిత్రం - భృత్యోఽహంకారసంయుతః
ససర్పేచ గృహే వాసో - మృత్యురేవ నసంశయః .
తే.గీ. మోసగాడగు మిత్రుఁడు, పొగరు బోతు
సేవకుఁడు, దుష్ట భార్యయు, శీవమున్న
యింటనుండుట, మృత్యువు వెంటనున్న
యట్టులే నిజము కనఁగ, హాని కలుగు.
భావము. దుష్టురాలైన భార్య, మోసగాడైన స్నేహితుడు, పొగరుమోతు అయిన
సేవకుడు, పాము ఉన్న ఇంటిలో నివాసం - ఇవి మృత్యువునే కలిగిస్తాయి.
సందేహం లేదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.