జైశ్రీరామ్.
శ్లో. భారస్యోద్వాహనార్థంచ - రథాక్షోభాజ్యతే యథా ౹
భోజనం ప్రాణాయాత్రార్థం - తద్వత్విద్వాన్ని శేవతే ౹౹
తే.గీ. రథము బరువును లాగ చక్రముల యిరుసు
లందు నూనెను పోయుట కందుము కద?
యటులె గుణులు జీవించంగ పటువునొసగు
నోగిరమె కోరుచును ననుయమొందఁ గనరు.
భావము. భారము ఎక్కకువ అయ్యినపుడు సులువుగా లాగుటకు రథ చక్రానికి
నూనె వేయుదురు.అదేవిధముగ విద్య ఉన్న జ్ఞానులు తమ జీవితం సాగించుటకు
మాత్రమే భోజనము చేయుదురు కానీ, భోజనము కోసమని జీవితము సాగించరు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.