గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2023, బుధవారం

నిష్ణాతోఽపి చ శాస్త్రార్థే ...... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్., 

శ్లో. నిష్ణాతోఽపి చ శాస్త్రార్థే  -  సాధుత్వం నైతి దుర్మతిః౹

ఆకల్పం జలమగ్నాపి  -  మార్దవం నైతి వై శిలా౹౹

తే.గీ.  శాస్త్ర నిష్ణాతుఁడైనను సహజమయిన

దుర్గుణంబును వీడడు దుష్టుఁడిలను,

నీట నెన్నాళ్ళు మున్గి యేపాటియైన

మెత్తబడ నేర్చునే శిల? మీరెఱుఁగరొ?

భావము. శాస్త్రార్థంలో సమర్థుడైనప్పటికి దుష్టుడు మంచితనాన్ని పొందలేడు.

యుగాలతరబడి నీటిలో మునిగి ఉన్నా బండరాయి మెత్తగా కాజాలదు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.