గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2023, బుధవారం

సమస్యాపూరణ. పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,... పూరణ...చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్. 

పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,

నా పూరణ.
👇
శ్రీపతి సృష్టిలోన కలి చిన్మయలీల లివే కదా కనన్?

జ్ఞాపకశక్తి తగ్గుటను కల్కి ప్రభావముచేత నీ ధరన్

పాపులు పుణ్యకార్యములు, పావను లన్యవిధంబునొప్పుటన్,

పాపులు పుణ్య భాజనులు, పావన మూర్తులు దుఃఖ భాజనుల్,
🙏
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.