గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2023, సోమవారం

వార్ధక్యం వయసా నాస్తి..... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  వార్ధక్యం వయసా నాస్తి - మనసా నైవ తద్భవేత్‌ 

సంతతోద్యమ శీలస్య - నాస్తి వార్ధక్య పీడనమ్‌. 

తే.గీ.  వయసుతో రాదు వృద్ధాప్య బాధ, కనఁగ,

మనసుతోడను రాదది, మనము సతము

నిరుపమోద్యమ మార్గాన నెగడుచున్న,

నిత్యసంతోషి యువకుఁడే నిత్యమిలను.

భావము.  ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. 

మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి 

ముసలితనపు పీడ ఉండదు. 

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, 

దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా 

ఆపాదింపబడిన ముసలితనమే.  70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే 

ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు 

పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. 

బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి 

సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది మానసిక వృద్ధాప్యం అంటే.. 

‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని 

రానీయకూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ 

అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి 

భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ 

వయో వార్ధక్యాన్ని కాదు. నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, 

సద్గ్రంథ పఠనం,సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, 

ఇష్టదేవతా ఉపాసనం,మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.