గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

దత్తాత్రేయ / గౌరీభట్ల / మెట్రాంశర్మ / ముత్యంపేట./ పదములతో వీరి కవితా వైభవం వర్ణన.... నేనుపూరించిన దత్తపది వర్ణన.

జైశ్రీరామ్. 

దత్తాత్రేయ / గౌరీభట్ల / మెట్రాంశర్మ / ముత్యంపేట.

హయవేగంబునర్వుపెట్టు కద దత్తాత్రేయ పద్యంబు స
చ్ఛ్రియమున్ గొల్పు కవిత్వ ధార కద గౌరీభట్ల వాగ్జాలమే
రయమున్బల్కు వధాన పద్యములు మెట్రాంశర్మ సత్కల్ప నీ
త్రయమున్ మించిన ధాటితో నడచు ముత్యంపేట పద్యావళుల్.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.