గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2023, బుధవారం

మక్షికా వ్రణ మిచ్ఛంతి ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో:  మక్షికా వ్రణ మిచ్ఛంతి, ధన మిచ్ఛంతి పార్థివాః ౹

నీచాః కలహ మిచ్ఛంతి, శాంతి మిచ్ఛంతి సాధవః ౹౹


తే.గీ.  మక్షికంబు వ్రణంపై మనసు పడును,

ధనము కోరును రాజు తా ధరణి నేల,

కలహమును గోరు నీచుఁడు కలుష మతిని,

శాంతినే గోరు సాధువు సరస మతిని.

భావం: ఈగలు పుండ్ల మీదనే వాలును. పాలకులు ధనం పైనే దృష్టి పెడతారు. 

నీచులు కలహాన్నే కోరుతారు. సాధువులు శాంతినే ఆకాంక్షిస్తారు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.