గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2023, ఆదివారం

ధారణావేదావధాననిధీ! వద్దిపర్తి పద్మాకరా!....చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులకు

ధారణావేదావధాన నిధి అను బిరుదుతో సత్కరించిన సందర్భముగా 

నా అభినందన పద్యము.

సీ.  ధారణావేదావధాననిధీ! వద్దిపర్తి పద్మాకరా! బ్రహ్మతేజ!

సన్మాన్య! గణపతి సచ్చిదానందు నాస్థానపండితవృత్తిఁ దనరు మీరు

వేద వేదాంగముల్ విదితంబు చేయుచు పౌరాణికులునయి ప్రజలలోన

భక్తిభావము పెంచి ముక్తిమార్గము సూపి హైందవ సంస్కృతి ననితరముగ

గీ. ప్రబలఁ జేయుటన్ గలి దోష మబలమగును,

ఘన శతాద్యవధానముల్ గణుతిఁ జేసి

మూడు భాషలకున్ గీర్తి ప్రోది చేసి

పీఠమునకు సత్తేజమై వెలుగుదురయ.🙏

ఈ నా పద్యముపై బ్రహ్మశ్రీ పద్మాకర్ గారి అభిప్రాయం.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.