గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2023, గురువారం

అవశ్య మనుభోక్తవ్యం .... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో౹౹  అవశ్య మనుభోక్తవ్యం  -  కృతం కర్మ శుభాశుభమ్।

కృతకర్మక్షయో నాస్తి  -  కల్పకోటిశతైరపి॥

ఆ.వె.  అనుభవింప వలయు నశుభ,శుభఫలము

లాచరించు కర్మ మోచనకును,

కల్పశతముకోటి గడచిపోయినకాని

యనుభవింపవలయునట్టికర్మ.

భావము:- చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే. 

వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.