గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2023, శుక్రవారం

శీలం శౌర్యమనాలస్యం...... మేలిమిబంగార్ం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  శీలం శౌర్యమనాలస్యం  -  పాండిత్యం మిత్ర సంగ్రహః 

అచోర హరణీయాని  -  పంచైతాన్య క్షయో నిధి: ౹

తే.గీ.  స్థవసుశీలమనెడి నిధి, సౌర్య నిధియు,

మహితపాండిత్యమను నిధి, మాన్యజనుల

మైత్రినిధియు, ననాలస్య మహిత నిధియు,

చౌర్యమవని యక్షయనిధుల్, సుగుణ గణ్య!

భావము.  సత్కీలము,సౌర్యము,కార్య దీక్షత,పాండిత్యం మంచి స్నేహితులను 

చేసుకొనేది,మొదలైన ఈ గుణాలు ఎవరూ దొంగతనం చేయడానికి అవ్వదు.

ఈ ఐదు నిధిలాంటివి.అందుకే అవి ఏవిధంగా ఎప్పటికీ పోవు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.