గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2023, గురువారం

చంద్రయాన్ విజయవంతంగా చంద్రమండలము చేరిన సందర్భంగా చెప్పలేనంత ఆనందంగాఉంది.

జైశ్రీరామ్..🙏

 ఓం శ్రీమాత్రే నమః.🙏

చంద్రయాన్ విజయవంతంగా చంద్రమండలముపై మనపతాకమును ప్రతిష్టించిన సందర్భముగా మన చంద్రయాన్ విజ్ఞానవేత్తలందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక అభినందనములందించుచున్నాను.

సోదర భారతీయులందరికీ అభినందనలు. మన అమ్మ భరతమాత నిత్యకల్యాణగుణ సంపన్న. అమ్మ ఆదరణనుపొందిన బిడ్డలకపజయమనేదే ఉండదు.

ఇక మన అమ్మకు తమ్ముఁడయిన మన మామ చంద్రుఁడు ఎంత ఆశగానో ఎదురు చూస్తూ ఆహ్వానం పలికి మన పతాకప్రతిష్ఠతోపులకించిపోయాడు. నాకైతే పట్టరానంతానందంగా ఉంది. ఆనందం తెలుపుకోడానికి మాటలే రావటం లేదు.

💐💐💐

శా.  శ్రీమన్మంగళ చంద్రుఁ డాతురతతో చేసాచి రమ్మంచు, నే

మామన్ మీకని యాదరింపగ, నటన్ మా భారతీయప్రభల్

వ్యోమంబందున వెల్గ కేతనము భావోద్దీప్తితోఁ జేరె, నో

శ్రీమాతా! భరతావని ప్రభలనే ప్రీతిన్ గృపన్ బెంచితే?

🙏

ఇది అంతా ఆ జగన్మాత అయిన శ్రీమాత దయవలన మాత్రమే మనకు లభించినది. ఆ తల్లికి పాదాభివందనములు సమర్పించుచున్నాను.

జైహింద్.

జై భారత్🙏

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.