గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2023, శుక్రవారం

అసంభవం హేమమృగస్య...ంఏలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.

శ్లో.  అసంభవం హేమమృగస్యజన్మ

తథాపిరామో లులుభేమృగాయ

ప్రాయః సమాపన్నవిపత్తికాలే

ధియోపిపుంసాం మలినాభవన్తి.

తే.గీ.  సంభవింపదు బంగారు ఛాయ జింక

తెలిసియున్ రాముడద్దానిఁ దేవనేగె,

నాపదలు వచ్చు వేళలో నధికులకును

బుద్ధి మాలిన్యమున్ బొందు పుడ్మిపైన.

భావము.  సృష్టిలో బంగారుజింకయొక్కపుట్టుక అనునది 

సంభవముకానిది.అయిననూ సకలసద్గుణసంపన్నుడైన

రాముడు కూడా బంగారుజింకొరకు ఆశపడ్డాడు.

ఆపదలుసంభవించేసమయమాసన్నమైనపుడు ,

మహాత్ములుకూడా సదసద్వివేకమును కోల్పోతారుకదా.

లోభము ఎంతయో చెడ్డగుణముకదా.

జైహింద్.


చింతా రామకృష్ణారావు.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.