గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము నందలి 11 వ పద్యము నుండి 15వ పద్యము వరకు..... రచన .. చింతా రామకృష్ణారావు... గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి

 జైశ్రీరామ్

11. ప్రారబ్ధ కర్మలను పారఁగఁద్రోలుమయ్యా.  

శ్రీ రాఘవున్దలపఁజేయుచు పుణ్యమిమ్మా.

ధీరోద్ధతిన్ గొలుపు దేవుఁడ కొల్పుమయ్యా.  

నీరక్ష కోరు మహనీయులు.సూర్యదేవా. 


12. జీవాత్మవై ప్రబలి జీవులనుందువీవే.  

నీవేడి ప్రాణమయి నిత్యము నిల్పు మమ్మున్.

శ్రీ విశ్వనాథుఁడవు శ్రీహరి వీవె మాకున్  

నీవారమయ్య. మననీయుమ, సూర్యదేవా. 


13. శ్రీ సప్తవర్ణయుత చిద్విలసన్మణీ! నే  

వేసారితిన్ కుటిల భీకర దుర్మదాంధుల్

మోసంబులన్ సతము భూమిని వ్రేచుచుండన్.  

మోసంబులన్ మడచి ప్రోవుము. సూర్యదేవా!


14. భూమిన్ రహించునవి భూజములెల్ల నీచే  

క్షేమంబుగా వరలి శ్రీప్రదమౌను దేవా.

నీమంబుతోడను వినీలమహాంబరానన్ 

సేమంబుగా తిరుగు శ్రీప్రద సూర్య దేవా! 


15. చిత్తంబులో నిను వసింపఁగ చేయనిమ్మా.  

ఉత్తేజమే కలుగునో కరుణాంతరంగా. 

మత్తత్వమీవె కనుమా కమలాప్త మిత్రా.  

హృత్తేజమై నిలుమ శ్రీ కర సూర్య దేవా! 

రచన .. చింతా రామకృష్ణారావు.

గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.