గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2023, బుధవారం

దేశరక్షా సమం పుణ్యం ..... నైవచనైవచ...... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  దేశరక్షా సమం పుణ్యం  -  దేశ రక్షా సమం వ్రతం,

దేశరక్షా సమం యోగో  -  సృష్టో నైవచ నైవచ.

తే.గీ.  పుడమి దేశరక్షణ మించు పుణ్యమేది?

వరలు దేశరక్షణబోలు వ్రతమదేది?

యుర్వి దేశరక్షణమించు యోగమేది?

సృష్టిలో కానరావివి, శ్రీగుణాఢ్య!

భావము. దేశరక్షణ చేయుటతో సమానమగు పుణ్యము, 

దేశ రక్షణతో సమానమగు వ్రతము, 

దేశరక్షణతో సమానమగు యోగము  ఈ సృష్టిలో లేవుకాకలేవు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.