గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2023, బుధవారం

ఏకాక్షర కందము..... రచన... చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్.

ఏకాక్షర కందము.

నిను నేననినానా? నను

నిను నేననినాననన్న నేనూనను నా

నిను నేనననన్నన్నా

నిను నేనననున్ననాన్న నినుననుననునే.

భావము.  నిన్ను నేనేనైనా అన్నానా? నన్ను ఎరయినా నిన్ను నేనన్నానని 

అనినచో నేను భరించనుఽయ్యయ్యో! నావాడివైన నిన్ను నేనననుకదా. 

నిన్ను నేను అనుటకు ప్రయత్నించినచో నిన్నూ నన్నూ నాన్న 

మనను అనకమానరు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.