గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2023, ఆదివారం

శ్రీకాకుళంలో 12 - 8 - 2023న జరిగిన శతావధానం - బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు-4/Sathavadhanam - Brahmas...

జైశ్రీరామ్.

సీ.  శ్రీకాకులంబన్న శ్రీ సూర్యదేవుని దివ్యప్రభాపూర్ణ దేవభూమి,

శ్రీకాకులంబన్న శ్రీసుమిత్రానంద సత్కలాక్షేత్ర సంస్కార భూమి,

శ్రీకాకులంబన్న శ్రీవేదవిజ్ఙాన పుణ్యమూర్తుల గన్న పూజ్య భూమి,

శ్రీకాకులంబన్న శ్రీమదాంధ్రప్రభల్ దేశంబునకు జూపు దివ్యభూమి,

తే.గీ.  ఆంధ్ర తేజంబె శ్రీకాకులాంధ్రభూమి,

ఆర్ష ధర్మంబె శ్రీకాకులాంధ్రభూమి,

రవిసుధార్ణవమున మున్గు రమ్యభూమి.

అనుపమానంబు శ్రీకాకులాంధ్ర భూమి,

మ.  వరపద్మాకరు సద్వధాన గరిమన్ వర్ణింపగా శక్యమా?

పరమోధ్భాసిత పద్యపద్మచయమే భాసించు నిక్షిప్తమై,

సురలోకద్యుతి చూపగల్గు మహితుల్, సూర్యప్రతాపాన్వితుల్,

వరణీయుల్, శుభ కావ్యకల్పన చణున్, భాస్వంతులిద్ధాత్రిపై.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.