గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2023, బుధవారం

మధుసిక్తో నింబఖణ్డః .... మేలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.

శ్లో.  మధుసిక్తో నింబఖణ్డః  -  దుగ్ధపుష్టోభుజంగమః

గంగాస్నాతోపి దుర్జనః  -  స్వభావంనైవముంచతి.

తే.గీ.  వేపపుల్లను తేనెలో వేసిచూడ,

పాలుత్రాగినన్ విషముండు పాము చూడ,

గంగలోమున్గు దురితుల గతిని చూడ,

సహజగుణములు వీడవు, సద్గుణాఢ్య!

భావము.  తేనెతో తుడిచిననూ ,వేపపుల్లచేదుపోదు.పాలుత్రాగిననూ

,సర్పములోనీవిషముతొలగదు.అట్లే దుర్జనుడు గంగాస్నానముచేసిననూ ,

తన స్వభావమును విడచిపెట్టడు. 

జైహిం ద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.