గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2023, ఆదివారం

ద్వే పదే మోక్ష బంధస్య...... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.   ద్వే పదే మోక్ష బంధస్య   -  మమేతి  న మమేతి చ

మమేతి బద్ధ్యతే జంతుః   -  న మమేతి విముచ్యతే.

తే.గీ.  బంధ మోక్షమ్ములకు రెండు పదము లిలను

కారణము గన, మమ యన కలుగు మనకు

విడువరానట్టి బంధము, విజ్ఞులార!

నమమ యన ముక్తి కలుగును, విమలగతిని.

కం.  నాదిగ తలచిన బంధము

కాదిదినాదియనుకొనిన కలుగును మోక్షం

బేదిశుభం బనుకొందువొ

యాదారినినడువుమయ్య, యమలిన చరితా!  

భావము.  ముక్తికి గానీ బంధానికి గానీ రెండు పదాలు కారణము..... 

“మమ”  "ఇది నాది" అనుకుంటే అది బంధం.... “న మమ 

” "ఇది నాది కాదు" అనుకుంటే మోక్షం.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.