గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము నందలి 1 వ పద్యము నుండి 5వ పద్యము వరకు..... రచన చింతా రామకృష్ణారావు... గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి

జైశ్రీరామ్.

1. శ్రీకామితార్థదుఁడచిన్మయ పూర్ణ తేజా!  

లోకేశ్వరామనసులోపల వెల్గుమయ్యా.

శ్రీకారమున్ గొనుమ చిత్ప్రభఁగొల్ప మాకున్. 

మాకింక నీవె కద మాన్యుఁడ సూర్యదేవా!    


2. వేదంబులందు కనిపించెడి విశ్వవేద్యా!  

మోదంబుతోడ జగమున్ దగ వృద్ధిఁ జేయన్

నీ దివ్య తేజసము నేవిధి పొందితో?    

మ్మోదంబుతోడఁ గనుపూజ్యుఁడసూర్య దేవా!


3. నీ తీక్ష్ణ తేజసమునే భరియింప నౌనా.  

నీ తాపమే ప్రజను నేలను గూల్చు చుండన్,

నీ తీరు మార్చుకొన నేరవదేలనయ్యా?  

భూతాపమున్ గనుమపూజ్యుఁడసూర్యదేవా! 


4. ఆకాశ వీధి నడయాడుచు పృథ్వినేలన్ 

శ్రీ కారమెప్పుడు ప్రసిద్ధిగ చుట్టినావో.

రాకేశుఁడున్ వెలుఁగు రాత్రులు నీదు కాంతిన్.  

నీ కాంతిచే వెలుఁగు నేలయు సూర్యదేవా.  


5. వృక్షంబులన్ సతము పృథ్విని నిల్పుదీవే.  

రక్షింతువీవె తనరారన్ గను రమ్య తేజా!

సుక్షేమమున్ గొలుపు సుందర సుప్రకాశా!  

మోక్ష ప్రదుండమము బ్రోవుము సూర్యదేవా! 

రచన చింతా రామకృష్ణారావు.

గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.