గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, అక్టోబర్ 2024, బుధవారం

జ్ఞాన పంజర ,మానవేంద్రత,కాన గాసిన వెన్నెల,జ్ఞానదా',బోధినీ,పరార్ధతా,గర్వ మెంచని,జగన్మిధ్య,సంగ పరిత్యాగ,బోధామృత,అశాశ్వత,మగటిమి,ఖగచర,తెగవు నింపు,గర్భ"తద్వర"వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,

జైశ్రీరామ్.


జ్ఞాన పంజర మందు చిల్కా!జగతి మిధ్యని పల్కవే!సర్వ సంగ ప్రబోధివై!
మాన వేంద్రత శాశ్వ తంబా!మగతనంబని రెచ్చకన్!మర్వరాని సు బోధలన్!
కాన గాసిన వెన్నెలంచున్!ఖగ చరుం దలపోయవే!గర్వ మంటని మేథతన్!
దీన రక్షణ దీప్తి బోధన్!తెగవు నింపు వరాంబుధై!తర్వుమా!చెడు వావలన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,పాదమునకు'26,అక్షసరమఘు లుండును,యతులు,
10,19,అక్షరములకు చెల్లును,


1,గర్భగత:-ఙ్ఞాన పంజర"వృత్తము,

జ్ఞాన పంజర మందు చిల్కా!
 మాన వేంద్రత శాశ్వతంబా!
కాన గాసిన వెన్నె లంచున్!
దీన రక్షణ దీప్తి బోధన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛంధము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరములుండును,

2,గర్భగత"మానవేంద్రతా"వృత్తము

జగతి మిథ్యని పల్కవే!
మగతనంబని రెచ్చకన్!
ఖగ చరుం దలపోయవే!
తెగవు నింపు వరాంబుధై!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"-కానగాసిన వెన్నెల"వృత్తము

సర్వ సంగ ప్ర బోధివై!
మర్వరాని సు బోధలన్!
గర్వ మంటని మేథతన్!
తర్వుమా!చెడు వావలన్!:

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

4,గర్భగత"జ్ఞానదా"వృత్తము,

జ్ఞాన పంజర మందు చిల్కా!జగతి మిథ్యని పల్కవే!
మాన వేంద్రత శాశ్వ తంబా!మగ తనంబని రెచ్చకన్!
కాన గాసిన వెన్నె లంచున్!ఖగ చరుం దలపోయవే!
దీన రక్షణ దీప్తి వెల్గన్!తెగవు నింపు వరాంబుధై!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18'అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"బోధినీ"వృత్తము,

జ్ఞాన పంజర మందు చిల్కా!సర్వ సంగ ప్ర బోధివై!
మాన వేంద్రత శాశ్వ తంబా!మర్వరాని సు బోధలన్!
కాన గాసిన వెన్నెలంచున్!గర్వ మంటని మేథతన్!
దీన రక్షణ దీప్తి వెల్గన్!తర్వుమా!చెడు వావలన్!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి"10,వ యక్షమునకు చెల్లును,

6.గర్భగత"పరార్ధతా"వృత్తము,

జగతి మిథ్యని పల్కవే?జ్ఞాన పంజర మందు చిల్కా!
మగ తనంబని రెచ్చకన్!మాన వేంద్రత శాశ్వతంబా?
ఖగ చరుం దలపోయవే!కాన గాసిన వెన్నె లంచున్?
తెగవు నింపు వరాంబుధై!దీన రక్షణ దీప్తి వెల్గన్?

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు18,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"గర్వ మెంచని"-వృత్తము,

సర్వ సంగ ప్ర బోధివై!జంఞాన పంజర మందు చిల్కా!
మర్వ రాని సు బోధలన్!మాన వేంద్రత శాశ్వతంబా?
గర్వ మంటని మేథతన్!కాన గాసిన వెన్నెలంచున్?
తర్వుమా!చెడు వావలన్!దీన రక్షణ దీప్తి వెల్గన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-జగన్మిథ్య"వృత్తము,

జగతి మిథ్యని బల్కవే!సర్వ సంగ ప్ర బోధివై!
మగ తనంబని రెచ్చకన్!మర్వ రాని సు బోధలన్!
ఖగ చరుం దలపోయవే!గర్వ మంటని మేథతన్!
తెగవు నింపు పరాంబుధై!తర్వుమా చెడు వావలన్!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"17"అక్షరములుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"సంగ పరి త్యాగ"వృత్తము,

సర్వ సంగ ప్రబోధివై!జగతి మిథ్యని బబ్కవే!
మర్వ రాని సుబోధలన్!మగ తనంబని రెచ్చకన్!
గర్వ మంటని మేథతన్!ఖగ చరుం దలపోయవే!
తర్వుమా చెడు వావలన్!తెగవు నింపు వరాంబుధై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"-బోధామృత"వృత్తము
జ్ఞాన పంజర మందు చిల్కా!సర్వ సంగ ప్ర బోధివై!జగతి మిథ్యని బల్కవే!
మాన వేంద్రత శాశ్వ తంబా?మర్వ రాని సు బోధలన్!మగ తనంబని రెచ్చకన్!
కాన గాసిన వెన్నెలంచున్!గర్వ మంటని మేథతన్!ఖగ చరుం దలపోయవే?
దీన రక్షణ దీప్తి వెల్గన్?తర్వుమా!చెడు వారలన్!తెగవు నింపు వరాంబుధై!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-అశాశ్వత"వృత్తము,

జగతి మిధ్యని బల్కవే?జ్ఞాన పంజర మందు చిల్కా!సర్వ సంగ ప్ర బోధివై!
మగ తనంబని రెచ్చకన్?మాన వేంద్రత శాశ్వ తంబా?మర్వ రాని సుబోధలన్
ఖగ చరుం దలపోయవే?కాన గాసిన వెన్నె లంచున్!గర్వ మంటని మేథతన్!
తెగవు నింపు వరాంబుధై!దీన రక్షణ దీప్తి వెల్గన్!తర్వుమా!చెడు వారలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-మగటిమి"వృత్తము,

సర్వ సంగ ప్రబోధివై!జ్ఞాన పంజర మందు చిల్కా!జగతి మిథ్యని బల్కవే!
మర్వరాని సు బోధలన్!మాన వేంద్రత శాశ్వతంబా?మగతనంబని రెచ్చకన్!
గర్వ మంటని మేథతన్!కాన గాసిన వెన్నెలంచున్!ఖగ చరుం దల పోయవే?
తర్వుమా!చెడు వారలన్!దీన రక్షణ దీప్తి వెల్గన్!తెగవు నింపు వరాంబుధై!

అనిరుద్ ఛందమునందలి "ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"ఖగ చర"వృత్తము,

జగతి మిథ్యని బల్కవే!సర్వ సంగ ప్రబోధివై!జ్ఞాన పంజర మందు చిల్కా?
మగతనంబని రెచ్చకన్!మర్వరాని సు బోధలన్!మాన వేంద్రత శాశ్వతంబా?
ఖగ చరుం దలపోయవే!గర్వ మంటని మేథతన్!కాన గాసిన వెన్నె లంచున్!
తెగవు నింపు వరాంబుధై!తర్వుమా!చెడు వారలన్!దీన రక్షణ దీప్తి వెల్గన్!

అనిరుద్ ఛందము లోని"ఉత్కృతి"ఛందమందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"తెగవు నింపు"వృత్తము,

సర్వ సంగ ప్ర బోధివై!జగతి మిథ్యని బల్కవే!జ్ఞాన పంజర మందు చిల్కా?
మర్వ రాని సు బోధలన్!మగతనంబని రెచ్చకన్!మాన వేంద్రత శాశ్వతంబా?
గర్వ మంటని మేథతన్!ఖగ చరుం దలపోయవే!కాన గాసిన వెన్నెలంచున్!
తర్వుమా!చెడు వారలన్!తెగవు నింపు వరాంబుధై!దీన రక్షణ దీప్తి వెల్గన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18.అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.