గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 48వ శ్లోకం. 367 - 372. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోబాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా

సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా 48  

367. ఓం *బాణశ్రేణ*యే నమః.

నామ వివరణ.

బాణముల వరుసను కలిగియున్న జనని మన అమ్మ

కం*బాణశ్రేణీ! * దురితుల

క్షోణిన్ బడఁ జేయుమమ్మ కూర్మిని నన్నున్

వాణీ భక్తుఁడనంచును,

ప్రాణంబుగ చూచుకొనుము, బ్రతిమాలెద నిన్.

368. ఓం *సహస్రాక్ష్యై* నమః.

నామ వివరణ.

వేయి కన్నులు కల తల్లి మన అమ్మ.

కంసురవినుత *సహస్రాక్షీ*!  

ధరలోనన్ సుగుణి తతిని తప్పక కనుమా,

నిరతము నీ సేవలలో

పరమార్థము గొనుదునమ్మ! పావన చరితా!

369. ఓం *సహస్రభుజపాదుకా* యై నమః.

నామ వివరణ.

వేయిభుజములూ పాదములూ కలిగిన తల్లి మన అమ్మ.

కంసకలము *సహస్రభుజపా

దుక! *  నీవే కద? మదంబ! తోయజ ముఖి! నా

కిక నీవే తోడగుచున్

సకలము సరి చూడుమమ్మ! చక్కగ జననీ!

370. ఓం *సన్ధ్యావలయే* నమః.

నామ వివరణ.

నడుమ భాగమున ముడుతలు కలిగిన జనని.

కం*సన్ధ్యావలి! * గొలుతు నుభయ

సన్ధ్యలలో మదిని నిన్ను చక్కగఁ గనుచున్,

నిన్ద్యపు తలపులు పాపుము,

సన్ధ్యాసమయంబులందుఁ జక్కగఁ గనుమా.

371. ఓం *త్రిసన్ధ్యాఖ్యా*యై నమః.

నామ వివరణ.

ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యా స్వరూపిణి అమ్మ.

తే.గీఘన *త్రిసన్ధ్యాఖ్య! * నీద్యుతిఁ గనగనిమ్ము,

పొగడగా నేర నిన్నెంచి పూర్తిగాను,

సంధ్యవేళల నిన్నెంచి సంస్తుతింతు,

వందనంబులుచేసెదనందుకొనుము.

372. ఓం *బ్రహ్మాణ్డమణిభూషణా*యై నమః.

నామ వివరణ.

బ్రహ్మాండము అనెడి మణిని అలంకారముగా కలిగిన తల్లి.

తే.గీఅలరు  *బ్రహ్మాణ్డమణిభూషణా! * మనమున

వెలయఁజేయుము బ్రహ్మాండ విశ్వవినుత

పద్యజాలమున్ నానుండి భవ్యముగను,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.