జైశ్రీరామ్.
శ్లో. సుఖార్థీ త్యజతే విద్యాం, విద్యార్థీ త్యజతే సుఖం |
సుఖార్థినః కుతో విద్యా, కుతో విద్యార్థినః సుఖం ||
తే.గీ. సుఖపిపాసి తా విడుచును సుహరవిద్య,
సుఖము విడుచును విద్యార్థి శోభఁగాంచ.
విద్య సుఖవాంఛితునకెట్లు పేర్మినబ్బు?
సుఖము విద్యార్థికెట్లబ్బు? శుభచరితుఁడ!
భావము. సుఖము కోరుకునే వాడు విద్యని వదలి వేస్తాడు. విద్యని కోరుకునే వాడు
సుఖాన్ని వదలి వేస్తాడు. సుఖం కోరుకునే వానికి విద్య ఎక్కడ? వానికి విద్య రాదు.
విద్యని కోరికునే వానికి సుఖము ఎక్కడ? వానికి సుఖాల మీద దృష్టి ఉండదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.