జైశ్రీరామ్.
శ్లో. పురాణ న్యాయమీమాంసా - ధర్మశాస్త్రాంగమిశ్రితాః |
వేదాః స్థానాని విద్యానాం - ధర్మస్య చ చతుర్దశః ||
(యాజ్ఞవల్క్య స్మృతి)
తే.గీ. మహి పురాణాళి, న్యాయ, మీమాంస, మరియు
ధర్మ శాస్త్రాంగములును, వేదములు నాల్గు,
స్థానములు పదునాలుగు ధర్మపథము
లరయ మనలకు నెఱుఁగుమో నిరుపమాన!
భావము. 1. అష్టాదశ పురాణాలు, 2. తర్కశాస్త్రము, 3. మీమాంసా, 4. మనుస్మృత్యాది ధర్మశాస్త్రములు, 5. వేదాంగములైన - శిక్షా, 6. కల్పము, 7. వ్యాకరణము, 8. నిరుక్తము, 9. ఛందస్సు, 10. జ్యోతిషము, 11. ఋగ్వేదము, 12. యజుర్వేదము, 13. సామవేదము, 14. అథర్వవేదము, - ఈ పదునాలుగు జ్ఞానసాధనములును, ధర్మహేతువులును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.