గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 59వ శ్లోకం. 442 - 448. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోజగజ్జరాజనిత్రీ పంచకర్మప్రసూతికా

వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః 59  

442. ఓం *జగతే* నమః.

నామ వివరణ.

సృష్టి స్వరూపిణి అమ్మ.

తే.గీ*జగతి!* కావగనెంచుమీజగతిని కృప,

నాదు దేహమే జగతిగా నమ్మి సతము

నిన్ను లోపలన్ గననెంతు సన్నుతముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

443.ఓం *జరాజనిత్ర్యై* నమః.

నామ వివరణ.

వృద్ధురాలయిన జగజ్జనని.

తే.గీ *జరాజనిత్రీ!* నిన్ మహోపకారి

వందురందరున్ నిజమైన ననితర గతి

నా మనంబున నిలువుమా నమ్మకముగ.

వందనంబులు చేసెదనందుకొనుము.

ఓం *జగజ్జరాజనిత్ర్యై* నమః

తే.గీ. లోకములు కొల్పి వాటి నేలుచు *జగజ్జ

రాజనిత్రీ! * మముంగూడ రమ్య గతిని

యేలుచుంటివి, నా మది నేలుమమ్మ,

హృదయ పద్మాన వసియించు హృద్యముగను.

444. ఓం *పఞ్చకర్మప్రసూతికా*యై నమః.

నామ వివరణ.

సృష్ట్యాది పంచ కర్మలను కల్పించిన తల్లి

తే.గీ.  *పఞ్చకర్మప్రసూతికా* పంచ విహిత

కర్మలన్ జేయఁ జేయుచున్ కర్మభువిని

వరలునట్లుగఁ జేయుమా యురుతరముగ,

వందనంబులు చేసెదనందుకొంఉము.

445. ఓం *వాగ్దేవ్యై* నమః.

నామ వివరణ.

వాక్కునకు దేవత అమ్మ.

తే.గీచక్కనైనట్టి  యమృతంపు వాక్కులిచ్చి,

చిత్రకవితా మహాశక్తి చేతికిచ్చి,

నన్ను కాచు *వాగ్దేవి! * నిన్ సన్నుతింతు

వందనంబులు చేసెద నందుకొనుము.

446. ఓం *ఆభరణాకారా*యై నమః.

నామ వివరణ.

ాలంకారములతో ప్రకాశించు జనని అమ్మ.

కం*ఆభరణాకారా! * యీ

లోభికి యాభరణ మీవె, లోకము నన్నున్

లోభిగ ననుకొన వచ్చును

లోభని, నిన్ వదలనట్టి లోభిని తల్లీ

447. ఓం *సర్వకామ్యస్థితా*యై నమః.

నామ వివరణ.

సమస్తమయిన కోరికలయందూ కలిగిన జనని.

తే.గీ*సర్వ కామ్యస్థితా!* స్థిత! సర్వ కామ్య

వయి తీర్చుము, నా లోన దయను నిలిచి

యాత్మతేజంబువగుమమ్మ, యహరహంబు

గొలుచుచుందును భక్తితో కోర్కె తీర.

448.ఓం *స్థిత*యే (స్థిత్యై) నమః .

నామ వివరణ.

స్థిరముగా ఎల్లప్పుడూ ఉండు జనని అమ్మ.

తే.గీహృదయ కమల సంస్థితవమ్మ   కదలక నిలు

ప్రాణమై యున్న *స్థితా!* భక్తిఁ గొలుతు

నిన్ను కవితామృతముతోడ మన్ననమున

వందనంబులు చేసెద నందుకొనుము.మున

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.