జైశ్రీరామ్.
శ్లో. విద్వత్సు విమలజ్ఞానా - విరక్తా యతిషు స్థితాః |
స్వీయేషు చ గరోద్గారా - నానాకారాః క్షితౌ ఖలాః ||
(రసగంగాధరః)
తేగీ. పండితుల వద్ద నొప్పు తా పండితునటు,
యతులవద్దను నొప్పుతా యతియనంగ
ధూర్తుఁ డిల చిందు విషమును తోటి తనదు
జనులపై నైజమును చూపు, సన్నుతాత్మ!
భావము. దుర్జనులు ఈ భూమిపై అనేక ఆకారములను కనబరచుక్రొందురు.
విద్వాంసుల ఎదుట శుద్ధమైన జ్ఞానం కలవారిలాగా, యతుల ఎదుర
విరక్తులలాగా కనబడుదురు. తనవారి (దాయాదుల) విషయంలో విషాన్నే
క్రక్కుదురు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.