జైశ్రీరామ్.
శ్లో.
వాసవీ వారుణీసేనా కులికా మంత్రరంజనీ ।
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా ॥ 49 ॥
373. ఓం *వాసవ్యై* నమః.
నామ
వివరణ.
ఇంద్రుని
యొక్క శక్తి స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*వాసవీ!* ఘన
నుతిభాస! భాగ్యమగుచు
నా మనంబున
కొలువుండి ప్రేమ మీర
సద్గుణంబులఁ
గొల్పుమా సరస మతిని,
వందనంబులు
చేసెద నందుకొనుము.
374. ఓం *వారుణీసేనా*యై నమః.
నామ
వివరణ.
పడమటదిక్కున
భయంకరమైన సైన్యమును కలిగియున్న జనని మన అమ్మ.
తే.గీ. *వారుణీసేన!* దుష్టులన్ బ్రబలనీక
కట్టడినిచేయుమమ్మరో!
కరుణ చూపి,
దుష్టభావనల్ పాపుమ
శిష్టపోష!
వందనంబులు
చేసెదనందుకొనుము.
375. ఓం *కులికా*యై నమః.
నామ
వివరణ.
ఉత్తమ
కులీన అమ్మ.
కం. *కులికా!* చింతావంశజ
మలినరహిత భక్తుఁడనని
మన్నించుము, నా
యిలవేల్పు వీవె,
కనుచున్
వెలయింపుము భక్తి
కవిత వెల్లువ కాగన్.
376. ఓం *మన్త్రరఞ్జన్యై* నమః .
నామ
వివరణ.
మంత్రముచే
రంజించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*మన్త్రరఞ్జనీ! * నీ నామ మంత్రములను
మనసునందున
భావించి మనన జేసి
నీకునర్పింతునమ్మ!
గణించి నన్ను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
377. ఓం *జితప్రాణస్వరూపా*యై నమః.
నామ
వివరణ.
జయించఁబడిన
ప్రాణ స్వరూపము కలది అమ్మ.
కం. పరమాత్మవె
నీవమ్మా!
కరుణామయివమ్మ
మమ్ము కాపాడుమిలన్,
నిరతము
నిన్నే గొలిచెద
వర
*జితప్రాణస్వరూప!* వందనమమ్మా!
378. ఓం *కాన్తా*యై నమః.
నామ
వివరణ.
తేజస్స్వరూపిణి
మనఅమ్మ.
కం. అంతా
నిన్నే కొలుతురు,
*కాంతా!* మనసార,
శుభము కాదనకిమ్మా,
సంతోష
మొసగు తల్లివి,
సాంతము
నను కావుమమ్మ సజ్జన భాసా!
379. ఓం *కామ్యవరప్రదా*యై నమః.
నామ
వివరణ.
కోరిన
కోరికలను ప్రసాదించు జనని మన అమ్మ.
తే.గీ.
గౌరవంబుగ
నిను మదిన్ గలయఁ జూచి
యాత్మలో
సేవ చేయగ నాశపడుదు,
కనుచు *కామ్యవరప్రదా!* కనికరించు,,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.