జైశ్రీరామ్.
శ్లో.
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా ।
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ ॥ 54 ॥
410. ఓం *వాయుమణ్డలమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
వాయుమండల
మధ్యమున ఉండు జనని లక్ష్మీదేవి.
తే.గీ. *వాయుమణ్డలమధ్యస్థ!
* పాయక
నను
నాత్మలోనుండి
నడిపించు మహరహంబు,
ప్రాణవాయువై
జగతికి ప్రభను పెంచు,
వందనంబులందించెద
నందుకొనుము.
411. ఓం *వ్యోమమణ్డలసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
ఆకాశమండలమున
ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ. *వ్యోమ
మండల సంస్థితా*!వ్యోమమదియు
కలిగె
నాలోన నీ వట వెలుగుమమ్మ,
కవితవై
ప్రభవించి యాకాశమంత
జ్ఞానసంపత్తి
నొసగుమా కమల నయన!
412. ఓం *చక్రికా*యై నమః.
నామ
వివరణ.
దివ్యమయిన
చక్రము కలిగిన తల్లి, శ్రీచక్రస్వరూపిణి అమ్మ.
తే.గీ. *చక్రికా! * గనుమమ్మ
సంసార చక్ర
మధ్యమున
నేను నలుగుచు మహితవయిన
నిన్ను
సేవింప లేకుంటి సన్నుతముగ,
నన్ను
గాపాడుమా కృపన్ మిన్నగాను.
413. ఓం *చక్రమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
శ్రీచక్ర
మధ్యభాగమున ఉండు జనని.
తే.గీ. చక్రమధ్యస్థ! యీ కాల
చక్రమునను
నలుగు
సామాన్య జనులకు వెలుఁగుఁ జూపి
నీవె
కాపాడుమమ్మరో భావగమ్య!
వందనంబులు చేసెద
నందుకొనుము.
414. ఓం *చక్రమార్గప్రవర్తిన్యై* నమః.
నామ
వివరణ.
శరీర
చక్రముల మధ్య ప్రయాణించు తల్లి.
తే.గీ. *చక్రమార్గ ప్రవర్తినీ! * వక్రగతిని
మాపి, నాలోన
కృపతోడ మసలుమమ్మ,
నిత్యమాత్మన్
బ్రకాశించు స్తుత్యవనఁగ,
వందనంబులందించెద
నందుకొనుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.