జైశ్రీరామ్.
శ్లో. ఆశాయా దాసా యే - దాసాస తే సర్వలోకస్య।
ఆశా దాసీ యేషాం - తేషాం దాసాయతే లోకః॥
తే.గీ. దాసులగువార లాశకున్, దాసులగుదు
రెల్లలోకములకు, నట్లె యెల్ల లోక
ములును దాసియౌ నాశయే పూజ్యులయిన
వారలకు దాసి యైనచో, భక్తవరద!
భావము. ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికీ దాసులే. ఆశ ఎవరికైతే
దాసియో అటువంటి వారికి సమస్త లోకమూ దాసియే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.