గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 58వ శ్లోకం. 435 - 441. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోవ్యోమకేశాఽఖిలప్రాణా పంచకోశవిలక్షణా

పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా 58  

435. ఓం *వ్యోమకేశా*యై నమః

నామ వివరణ.

ఆకాశమే కేశపాశముగా కలిగిన జనని మన అమ్మ.

తే.గీ*వ్యోమకేశ! * సదాచార ధీ మనోజ్ఞ!

శ్రీమతీమణులైనట్టి స్త్రీలకీవు

రక్ష గొలుపగ నుండు పరీక్ష మాని,

వారి యబలతఁ బాపుమా! వారిజాక్షి!

436. ఓం *అఖిలప్రాణా*యై నమః.

నామ వివరణ.

సమస్త ప్రాణికోటియు అమ్మయే.

కంవిను మొర *లఖిల ప్రాణా!*

కనుమా భూజనుల వెతలు, కాదనకమ్మా,

విని కావనెవ్వరుండిరి?

గుణగణ్యవు నీవె కాక కువలయమందున్.

437. ఓం *పఞ్చకోశవిలక్షణా*యై నమః.

నామ వివరణ.

1. అన్నమయము, 2. ప్రాణమయము, 3. మనోమయము, 4. విజ్ఞానమయము, 5. ఆనందమయము అను పంచకోశముల ప్రభావము ఏమాత్రమూ లేని విలక్షణ అమ్మ.

తే.గీ.  *పంచ కోశ విలక్షణా! * పరవశింతు

సంచితంబులఁ బాపినన్ సదయ నీవు,

పంచఁబోకుము కష్టముల్, భక్తి నొసగి,

నిన్ను పూజించ నిమ్మింక నేర్పు మీర.

438. ఓం *పఞ్చకోశాత్మికా*యై నమః .

నామ వివరణ.

శరీరమున ఐదుకోశములందును ఉండు తల్లి మన అమ్మ.

తే.గీ.  *పంకోశాత్మికా! * యీ ప్రపంచమంత

పంచకోశాత్మ రూపె భావించి చూడ,

పంచకోశప్రదీప్తుల నెంచి చూచి

కావుమో మాత సతతము కరుణతోడ.

439. ఓం *ప్రతీచే* నమః. (ప్రత్యక్)
నామ వివరణ.                                                                                                      
అదృశ్యముగా అన్నిటనూ ఉండు జనని.                                                                         
తే.గీశ్రీ *ప్రతీచి* దినకరుఁడు చేరి నిన్ను

హాయిఁ గొలుపుచు నుండు సాయంత్ర వేళ,

ప్రాక్ ప్రతీచీల మధ్యను పడి వసించు

మమ్ము కాపాడుమని చెప్పు మంగళాంగి!

440. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః.

నామ వివరణ.

పంచబ్రహ్మలయొక్క ఆత్మగా ఉన్న తల్లి.

కంసకలవు *పంచబ్రహ్మా

త్మికా!* నినుఁ గొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం

బకళంక! యొసగి కావుము,

ముకుళిత హస్తములతోడ ముందుగఁ గొలుతున్.

441. ఓం *శివా*యై నమః.

నామ వివరణ.

శుభములకు ఆలవాలమగు జనని.

తే.గీశ్రీ *శివా!* దైవసన్నిధిన్ జేరఁ జేసి

ముక్తి మార్గంబుఁ గొలుపుమా భక్తులకును,

ధ్యాసతో నిన్నుఁ గొలిచెద తల్లివీవె

కావ నుంటివటంచును గమలనయన!

ఓం *పఞ్చబ్రహ్మాత్మికాశివా*యై నమః.

కంసకలవు *పఞ్చబ్రహ్మా

త్మికా శివ! కొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం

బకళంక! యొసగి కావుము,

ముకుళిత హస్తములతోడ ముందుగఁ గొలుతున్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.