గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2024, శుక్రవారం

యః సతతం పరిపృచ్ఛతి.. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్

శ్లో.  యః సతతం పరిపృచ్ఛతి

శృణోతి సంధారయత్యనిశమ్ |

తస్య దివాకరకిరణైః

నలినీవ వివర్ధతే బుద్ధిః ||

(పంచతంత్రం)

తే.గీ.  ఎవఁడు ప్రశ్నించుచుండునో యెల్లవేళ

లందు, వినుచుండునో, నిత్య మరయుచుండు

నో యతనిబుద్ధి రవికాంతి నొందినట్టి

పద్మమట్టుల వికసించు, భక్తవరుఁడ!

భావము.  ఎవరు ఎల్లపుడూ ప్రశ్నిస్తాడో, చెవులారా వింటాడో మరియు ఎల్లపుడూ 

చక్కగా గ్రహిస్తాడో అతని బుద్ధి సూర్యకిరణాలతో తామరపుష్పం ఎలాగో అలాగే 

వృద్ధిచెందును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.