గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 53వ శ్లోకం. 406 - 409. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోకైవల్యపదవీరేఖా సోమమండలసంస్థితా

సూర్యమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా 53  

406.  ఓం *కైవల్యపదవీరేఖా*యై నమః.

నామ వివరణ.

మోక్షమార్గము మన జనని.

స్వయం కల్పిత కాంతిపుంజ వృత్తము.

గణములు….              ….. యతి 9 అక్షరము.

*కైవల్యపదవీరేఖా! * కాంతిరేఖా! మనోహరీ!

భావంబునను నీవేగా ప్రాణమై కాంతి చిందుదే,

జీవాత్మవయి నీవే  నా చిత్తమందున్ వెలుంగుదే,

దేవీ! గొలుపుమా నీదౌ దీప్తి నాలో, నమోస్తు తే.

407.  ఓం *సోమమణ్డల సంస్థితా*యై నమః.

నామ వివరణ.

చంద్ర మండలమున ఉండు తల్లి.

తే.గీ. *సోమ మండలసంస్థితా! * శుభదవీవు,

చల్లనైనట్టి చంద్రికల్ సదయనీవు

నాదు కవితలన్ వెలయించు నయనిధాన!

నీ కృపన్బ్రజ నేలుమా నిరతమీవు.

408. ఓం  *సూర్యమణ్డల మధ్యస్థా*యై నమః.

నామ వివరణ.

సూర్యమండల మధ్యప్రదేశమున ఉండు జనని.

తే.గీ.  *సూర్యమణ్డల మధ్యస్థ! * శోభలొలుకు

దివ్య కవితా మహాద్యుతిన్ భవ్యముగను

నాకుఁ దయచేయుమమ్మరో! ప్రాకటముగ

వందనంబులందించెద నందుకొనుము.

ఓం *సూర్యమణ్డలసంస్థితా*యై నమః ౪౦౦

నామ వివరణ.

సూర్యమండలమున ఉండు తల్లి మన అమ్మ.

తే.గీ*సూర్యమణ్డలసంస్థితా! * శుభ నిధాన!

లోక కల్యాణకాంతులన్ బ్రాకటముగ

మాకునందింపఁ జేరితే శ్రీకరముగ

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *సోమమణ్డలమధ్యస్థా*యై నమః.

నామ వివరణ.

తే.గీ.  *సోమ మణ్డల మధ్యస్థ! *  శుభ నిధాన!

చల్లనైనట్టి వెన్నెల నుల్లమలర

నాకు దయచేసి, కవితలోన వెలిగి యిట

పాఠకుల మతికెక్కుమా  భవ్యముగను.

409. ఓం *హ్నిమణ్డలసంస్థితా*యై నమః.

నామ వివరణ.

అగ్నిమండల మధ్యమున ఉండు జనని మన అమ్మ.

తే.గీ*హ్నిమణ్డలసంస్థితా! * యాహ్నికముల

నంతరాత్మలో జరుగనీ శాంతినలర

కర్మబంధముల్ విడఁజేసి ధర్మవర్త

నంబు కలిగించు కృపతోడ నయ నిధాన!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.