జైశ్రీరామ్.
శ్లో. ప్రియః ప్రజానాం దాతైవ - నపునర్ద్రవిణేశ్వరః |
ఆగచ్ఛన్ కాంక్షతే లోకైః - వారిదో న తు వారిధిః ||
(భోజచరిత్ర)
తే.గీ. ప్రజలకిల దాతయే కనఁ బరమప్రియము,
విత్తవంతుఁడు కాదిలన్ బ్రియము ప్రజకు,
వారిదంబన్న ప్రియమిల ప్రజలకిలను,
వారిధిని కోరరెన్నడున్ నీరు కోరి.
భావము. ప్రజల పాలిట దానం చేసే (ఇచ్చే) దొరయే కావలసినవాడు.
ధనాధిక్యత గలవాడు కాదు. నీటినిచ్చే మేఘాలకొఱకు అందరూ ఎదురుచూస్తారు
కానీ సముద్రము కొఱకు కాదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.