జైశ్రీరామ్.
శ్లో. సులభాః పురుషా రాజన్ - సతతం ప్రియవాదినః |
అప్రియస్య తు పథ్యస్య - వక్తా శ్రోతా చ దుర్లభః ||
(రామాయణం-అరణ్యకాండం 37-2 మారీచుఁడు రావణునితో పలికినది.)
తే.గీ. ప్రియము పలికెడి వారలు పృథివిపైన
సులభు లెప్పుడున్, గనగ నసులభు లప్రి
యమును, హితమునున్ బలుకు మహాత్ములు, విను
వారు, నిజమిది, సత్యమే పలుకుటొప్పు.
భావము. రాజా! ఎల్లపుడూ ప్రియమైనదానినే పలికే పురుషులు సులభంగా ఎల్లెడలా
దొరకుతారు. అయితే అప్రియమైననూ హితమైన మాటలను పలికేవారు కానీ,
వినువారు కానీ దుర్లభులు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.