గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2010, శుక్రవారం

విజయ కాంక్షితులు మనవిని వినుడు ( శార్దూల, కంద,గీత గర్భ సీసము )

ప్రియ పాఠకులారా!
నాచే రచింపఁబడిన ఈ క్రింది సీసపద్యములోనే  ఒక మత్తేభవృత్త పద్యము, ఒక కంద పద్యము కూడా ఉన్నాయి. దయతో గమనించి, ఆదరించి, నన్ను ఉత్సాహ పరచ గలరని ఆశించుచున్నాను. ఆ పద్యాన్ని చూడ వలసినదిగా మనవి. 
సీ:-
వి జయ కాంక్షల్ గల విజ్ఞులైన సుమతుల్ సన్ మార్గమున్ బోవగాన్ మనసుప
డి జయ ఘంటల్ వినుడీ యటంచుఁ గొలుపున్, సద్ఘంట నాదోల్లసత్ సుశబ్ద
ము జయ మార్గంబులు పూల బాటలవగా, చక్కంగ నొప్పారి, శౌరి, విధియు,
మరియు సాంబుండును మార్గ దర్శులవగాఁ బ్రీతిన్ బ్రవర్థిల్లరే! మహత్వ . . . 
తే.గీ.:-
జయములు లభించు మనకు విజయముల కిల 
జనని శైలజన్ మదిఁ దలచన్ భయములఁ
బాసి, శుభములన్ బ్రియమున భాసిలనగు
మనవిని వినుడు మది నంద రును సుఖింప. 
సీస గర్భ మత్తేభము:-
జయ కాంక్షల్ గల విజ్ఞులైన సుమతుల్ సన్ మార్గమున్ బోవగాన్ 
జయ ఘంటల్ వినుడీ యటంచుఁ గొలుపున్, సద్ఘంట నాదోల్లసత్ 
జయ మార్గంబులు పూల బాట లవగా, చక్కంగ  నొప్పారి, శౌ
రియు సాంబుండును మార్గ దర్శులవగాఁ బ్రీతిన్ బ్రవర్థిల్లరే!
తే.గీ.గర్భ కందము:-
జయములు లభించు మనకు వి  
జయముల కిల జనని శైల జన్ మదిఁ దలచన్
భయములఁ బాసి, శుభములన్ 
బ్రియమున భాసిలనగు, మన విని వినుడు మదిన్.
భావము:-
విజయమును సాధించాలి అనే కోరిక గలిగిన విజ్ఞత గల మంచివారు, మంచి మార్గమున పయనించుట కొఱకు ఈ ఘంటానాదము వినండి, అంటూ  ఘంటా నాదమును చేయు చుండును.   మంచికి స్థానమైన ఘంటానాదము నుండి ప్రకాశ వంతమైన విజయ ప్రదమైన త్రోవలు పూల బాటలు కాగా,  త్రిమూర్తులుమార్గ దర్శనము చేయు చుండగా, చక్కగా ఒప్పిదమై  యుండి, యిష్టా పూర్వకముగా మిక్కిలి అభివృద్ధిని పొందకుందురా!
ఈ జగతిలో  విజయములకు తల్లియైన పార్వతీ మాతను మనస్సులో భావించినట్లైతే గొప్ప విజయములు ప్రాప్తించును. భయమును వీడి, ప్రేమతో శుభములతోఁ బ్రకాశింప వచ్చును. ఈ నా మనవిని మీరు  మనసు పెట్టి  వినండి.
చూచారు కదండీ! మీ అమూల్యమైన సూచనలు, అభిప్రాయాలు తెలియఁ జేయఁ గలందులకు మనవి. 
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.